త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డె జంటగా నటించగా, జగపతి బాబు విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నటీనటులకు పర్‌ఫార్మెన్స్‌ పరంగా అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ సైతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కథా నేపథ్యంతో సాగిపోయే అరవింద సమేత మూవీ సాంగ్స్, ఆర్ఆర్‌కు థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఎన్టీఆర్ అభిమానులనే కాకుండా యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా మ్యూజిక్ పార్టనర్ అయిన జీ మ్యూజిక్ కంపెనీ తాజాగా ఈ సినిమా నుంచి అరవింద సమేత వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసింది. ఇకపై ఈ సినిమా నుంచి మిగతా వీడియో సాంగ్స్‌ని సైతం ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు జీ మ్యూజిక్ ప్లాన్స్ చేసుకుంటోంది.