Baby Movie ott release date: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. మరో యువ నటుడు విరాజ్‌ అశ్విన్‌ ఓ కీలక పాత్రలో నటించాడు. యూత్‌ఫుల్‌ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సాయిరాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్‌ నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారు. శుక్రవారం (జులై 14)న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తొలి రోజు మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా అనంద్, వైష్ణవి తమ నటనతో కన్నీళ్లు తెప్పించారు. చాలా రోజుల తర్వాత మంచి లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలిగిందని అడియన్స్ అంటున్నారు. విజయ్‌ బుల్గానిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాపై అడియన్స్ తోపాటు టాలీవుడ్ ప్రముఖుల సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, రాశీఖన్నా తదితర నటీనటులు సినిమాను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా మూవీ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రం చూసి రష్మిక ఎమోషనల్ అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీప్రియులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉంది.  అంటే ఆగస్టు మూడో లేదా నాలుగో వారంలో బేబీ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


Also Read: Sai Dharam Tej About Politics: రాజకీయాలపై సింపుల్‌గా తేల్చిపడేసిన సాయిధరమ్ తేజ్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook