Baby Trailer Review: సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇవాళ AAA సినిమాస్‌లో జరిగిన ఈవెంట్‌లో బేబీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన బేబీ మూవీ జూలై 14న వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు మరో వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
  
చాలా సినిమాల్లో చూపించినట్టుగానే ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ల ప్రేమకథ హై స్కూల్ రోజుల్లోనే ప్రారంభం అవుతుంది అని బేబీ ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. అయితే, హీరో ఆనంద్ దేవరకొండ 10వ తరగతి ఫెయిలయి ఆటో డ్రైవర్‌గా మిగిలిపోగా.. వైష్ణవి చైతన్య మాత్రం ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేరుతుంది. అక్కడే విరాజ్ అశ్విన్ తో వైష్ణవికి పరిచయం ఏర్పడుతుంది. తెలియకుండానే వైష్ణవి, విరాజ్‌ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అప్పటివరకు ఆనందంగానే ఉందనుకున్న జీవితం అల్లకల్లోలానికి గురిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేను అందరిలా కాదు.. అందరు వేరు.. నేను వేరు అంటూనే తనకు తెలియకుండానే విరాజ్‌ని ఆకర్షిస్తోన్న వైష్ణవి, మరోవైపు తన వైష్ణవి తనకు కాకుండా పోతోందేమోననే ఆందోళన, భయం ఆనంద్.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో గెలిచేది ఎవరు, ఓడెది ఎవరు అనే సస్పెన్స్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సాయి రాజేష్ సక్సెస్ అయ్యాడు అని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. 



ఇది కూడా చదవండి : శ్రీవిష్ణు ‘సామజవరగమన’ కలెక్షన్ల సునామీ.. తొలి వారం ఎంత వసూలు చేసిందంటే?


అన్నింటికిమించి యువతను ఆకట్టుకునేలా, ఇది తమకే వర్తిస్తుందేమో అని అనిపించేలా, దాదాపు నరం మెలిపెట్టేలా పలు సన్నివేశాల్లో ఎమోషనల్ డైలాగ్స్ బేబీ మూవీ ట్రైలర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. కొన్ని సన్నివేశాల్లో ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ సైతం విజయ్ దేవరకొండను మైమరిపించేలా ఇమిటేట్ చేశాడు.


ఇది కూడా చదవండి : O Sathiya Review: ఓ సాథియా.. సినిమా రివ్యూ, రేటింగ్ అండ్ పబ్లిక్ టాక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK