Gam Gam Ganesha Movie First Single: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవర కొండ (Anand Deverakonda) కొత్త చిత్రం‘'గం..గం..గణేశా'(Gam Gam Ganesha Movie). ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ శెట్టి డైరెక్టర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గం..గం..గణేశా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచేశాయి. బేబీ సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘గం..గం..గణేశా మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  బేబీలో ఆనంద్ తన నటనతో ఆడియెన్స్ ను ఫిదా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ బృందావనివే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో ఓ డైలాగ్ తో స్టార్ అయి.. సాంగ్ తో ముగుస్తుంది. ఈ సాంగ్ ప్రోమో కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. సినిమా సినిమాకు సంబంధం లేకుండా కొత్త కథల ఎంపిక చేసుకుంటూ హిట్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు ఆనంద్. దొరసాని, మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, పుష్పకవిమానం, బేబీ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్‌ దేవర కొండ. విభిన్న పాత్రలను ఎంచుకంటూ ఫ్యామిలీ అండ్ యూత్ లో మాంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఈ యువ హీరో. విజయ్ దేవరకొండ తమ్ముడిగా కాకుండాతన నటనతో ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 



Also Read: Mark Antony Movie: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'మార్క్ ఆంటోని'.. 100 కోట్లకు చేరువలో విశాల్ మూవీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి