Ananya Nagalla Bold Photoshoot: తెలుగు సినీ పరిశ్రమ పేరుకే తెలుగు సినీ పరిశ్రమ కానీ చాలా తక్కువ మంది తెలుగు నటీనటులు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లను బాంబే లేదా ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది అచ్చ తెలుగు అమ్మాయి ఖమ్మం జిల్లాకు చెందిన అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మారింది. ఒకపక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క సినిమాల మీద ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేసి మల్లేశం సినిమాలో ప్రియదర్శి భార్య పాత్రలో నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి సినిమా ఒక రకంగా చెప్పాలంటే డీ గ్లామర్ రోల్, పద్ధతిగా కనిపించే తెలుగు అమ్మాయి పాత్ర కావడంతో ఆమెకు తర్వాత వస్తున్న అవకాశాలు కూడా దాదాపుగా అలానే వచ్చాయి. ప్లే బ్యాక్ అనే సినిమాలో ఒక పీరియాడిక్ డ్రామా సబ్జెక్టులో ఆమె ఒక తెలుగు అమ్మాయి పాత్రలోనే కనిపించింది. ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. ఆ తరువాత వకీల్ సాబ్ సినిమాలో వంచనకు గురికాబడిన ఆడపిల్లగా కనిపించింది. అయితే ఎంత అందంగా ఉంటే లాభమేమి ఆమెకు అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రావడం లేదు.



ఈ క్రమంలోనే తాను అందాల ఆరబోత విషయంలో ఎలాంటి గీతలు గీసుకోలేదని చెప్పేందుకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయి హాట్ షో చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే పలు సందర్భాలలో పొట్టి బట్టలు ధరించి చాలా చిట్టి గౌనులు ధరించి అందాలు ఆరబోసేందుకు ప్రయత్నించిన ఆమె ఇప్పుడు ఏకంగా ఒక బోల్డ్ ఫోటోషూట్ తో అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె అసలు జాకెట్టు కూడా ధరించకుండా ఒక వీడియో షేర్ చేసి హాట్ టాపిక్ గా మారగా ఇప్పుడు కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసి రచ్చ రేపింది. వాస్తవానికి ఆమె జాకెట్ ధరించింది కానీ అది ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేసిందని కొందరు అంటుంటే ఆమె అసలు జాకెట్టు ధరించలేదని మరికొందరు అంటున్నారు.


ఇక ఆమె జాకెట్ లాంటిదేమీ ధరించకుండా చీర కొంగుతో తన ఎద అందాలను కప్పేసి కొన్ని బోల్డ్ ఫోటోలు దిగి షేర్ చేసింది. అంతే కాదు ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా జారీ చేసిందండోయ్. ఎవరి నుంచి ఒక మాట కూడా పడకుండా ఎవరు తనని జడ్జ్ చేయకూడదు అనుకునే ఒక అమ్మాయి ఎంత నెగెటివిటీ వచ్చినా పర్లేదు తాను నమ్మిన దారిలో ముందుకు వెళ్లాలని అనుకుంటుందని ఎవరు ఊహిస్తారు?? అంటూ ఆమె ప్రశ్నించింది. గ్లామర్ ప్రపంచంలో ఉన్నంత మాత్రాన వారి గురించి ఏది పడితే అది మాట్లాడే హక్కు మీకు లేదంటూ కామెంట్ చేసిన ఆమె ఇతరుల మీద దయగా ఉండడం అలవర్చుకుంటే మంచిదంటూ కామెంట్ చేసింది. మొత్తం మీద ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.
Also Read: Pathaan 1000 Crore Club: వెయ్యి కోట్ల క్లబ్లో జాయినయిన పఠాన్.. ఇండియన్ హిస్టరీలో ఐదవ సినిమా!


Also Read: Alia Bhatt Sister Pooja Bhatt : తెలుగు సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ అక్క.. ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook