Ananya Panday Smoking : పెళ్లి వేడుకల్లో దమ్ముకొడుతున్న అనన్య పాండే.. పిక్స్ వైరల్

Ananya Panday Smoking అనన్య పాండే ది మోస్ట్ ట్రోల్డ్ హీరోయిన్గా గత ఏడాది నిలిచింది. లైగర్ సినిమాతో అనన్య పాండే కెరీర్ పాతాళానికి పడిపోయింది. సినిమా విడుదలకు ముందుకు ఎంతగా లేచిందో.. రిలీజ్ అయిన తరువాత అంతగా గ్రాఫ్ పడిపోయింది
Ananya Panday Smoking హీరోయిన్లు దమ్ముకొట్టడం, మందు కొట్టడం అనేది కామన్. అసలు హీరోయిన్లు అని కాదు.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ మందు కొడుతున్నారు, దమ్ము కొడుతున్నారు. ఇందులో జండర్ సమస్య ఏమీ లేదు. కానీ హీరోయిన్లు ఇలా పబ్లిక్‌గా మందు గానీ దమ్ము గానీ కొడుతూ కనిపించినప్పుడు జనాల దృష్టి ఎక్కువగా అటు వైపే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు అనన్య పాండే పెళ్లి వేడుకలకు వచ్చి ఇలా దమ్ము కొడుతూ కనిపించి మరోసారి అభాసుపాలు అవుతోంది. ప్రస్తుతం అనన్య పాండే సిగరెట్ తాగుతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలే అనన్య పాండే మీద జనాలు ఆగ్రహంతో ఉంటారంటే.. ఇలా అడ్డంగా బుక్కవ్వడంతో మరింత దారుణంగా ఆడేసుకుంటున్నారు.
ఇక అనన్య పాండేను జనాలు ఎలా ట్రోల్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఆమెకు సరిగ్గా యాక్టింగ్ రాదని, డ్యాన్స్ కూడా రాదని, స్టార్ సెలెబ్రిటీ అని తనకు తానే ఊహించుకుంటుందని, తన తండ్రి ఏదో పెద్ద స్టార్ అని భ్రమ పడుతుందని అంటూ జనాలు ఇలా ఆమెను నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తుంటారు.
ఇక లైగర్ సినిమా సమయంలో విజయ్‌తో కలిసి దేశమంతా ప్రచారం చేసింది. తెలుగులోనూ స్పీచులు ఇచ్చింది. ఒక వేళ లైగర్ సినిమా హిట్ అయి ఉంటే.. అనన్య కెరీర్ ఇంకోలా ఉండేది. కనీసం అనన్య పాత్ర, నటించిన విధానం బాగున్నా కూడా సౌత్‌లో ఆమెకు మళ్లీ ఆఫర్లు వచ్చేవి. కానీ ఏ ఒక్కటీ సరిగ్గా లేకపోవడంతో అనన్యను ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ ఆమె తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టేసింది. సౌత్‌లో పాగా వేయాలన్న ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
అనన్య పాండే అయితే లైగర్ ఫ్లాప్‌ను అస్సలు పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. లైగర్ సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్‌తో ట్రోలింగ్ జరుగుతూ ఉంటే.. అనన్య మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి బీచుల్లో హంగామా చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే.
Also Read: Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే
Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook