Simba: సింబా ట్రైలర్ లాంచ్… నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ తో మెప్పించనున్న అనసూయ
Simba Trailer: నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ గా..ఎంతో కొత్త కాన్సెప్ట్ తో.. సింబా అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్.. ఈరోజు లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఎన్నో ఆసక్తికరమైన డైలాగ్స్ తో.. అలానే ఎంతో ఆసక్తికరమైన సీన్స్ తో.. సాగింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మీకోసం..
Anasuya Simba: అనసూయ హీరోయిన్ గా నటించే సినిమాలు అన్నీ కూడా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాయి అనేది మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నటి. ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోంది.. అందుకోసం చెట్లు నాటడం ఎంత ముఖ్యం అనే నేపథ్యంలో.. సింబా అనే చిత్రం రాబోతోంది.
ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో ఎంతోమంది దమ్ము, మందు కన్నా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారని.. వస్తువులు మనతో ఉంటాయి కానీ.. మొక్కలు మన తరువాత కూడా ఉంటాయి.. అనే మంచి మెసేజ్ తో ఈ సినిమా వస్తోందని.. ఈ చిత్ర ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అనసూయ, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను అలరిస్తోంది. రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ సినిమాని నిర్మించగా.. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో..ముందుగా అనసూయ మాట్లాడుతూ.. ‘వృక్షో రక్షతి రక్షితః అనే విషయాన్ని ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు. మన పర్యావరణాన్ని మనమే ఎంతగా పారు చేస్తున్నామో మన అందరికీ తెలిసిన విషయమే. సింబా సినిమా చాలా మంచి మెసేజ్ తో రాబోతోంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా..అందరికీ తప్పకుండా నచ్చేలా ఉంటుంది. కబీర్, శ్రీనాథ్, వశిష్ట, దివి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు. జగపతి బాబు గారు పాత్ర ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైనది. ఈ సినిమా ఒక్కరికి నచ్చినా.. కూడా ఒక్కరిలోనూ మార్పు వచ్చిన మా కృషి ఫలించినట్టే’ ఆని చెపుకొచ్చారు.
ఆ తరువాత మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి..నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సంపత్ నంది, రాజేందర్ గారికి కృతజ్ఞతలు. నేను సంపత్ నంది గారితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నన్ను డైరెక్టర్ గా ఆయనే లాంచ్ చేస్తానన్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ఆయనే అందించారు. నేను డైరెక్షన్ మాత్రమే చేశాను. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అందరి సహకారంతోనే సినిమాను పూర్తి చేయగలిగాను.మ’ అని చెప్పుకొచ్చారు.
దివి మాట్లాడుతూ.. ‘సింబా సినీమాలో చాలా మంచి సందేశం ఉంది. ఈ సినిమాని మేము అందరం కూడా ప్రాణం పెట్టి చేశాం. నాకు ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా థాంక్స్. ఆగస్ట్ 9న ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.తప్పకుండా ఈ సినిమాని చూడండి,” అని అన్నారు.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter