Anasuya Anchor Ravi Fun : యాంకర్ అనసూయ బయట కనిపించక చాలా రోజులే అవుతోంది. ఇక బుల్లితెరకు సైతం అనసూయ దూరంగా ఉంది. ఈటీవీని వదిలిన స్టార్ మాకు వెళ్లిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో సింగింగ్ షో చేసింది. కానీ అది అయిపోయింది. ఇక ఇప్పుడు ఏ షోలు లేక బుల్లితెరకు దూరంగా ఉంది. తాజాగా అనసూయ ఓ ఈవెంట్లో కనిపించింది. మాయాపేటిక అనే సినిమా ఈవెంట్ కోసం అనసూయ వచ్చింది. అలా అనసూయ రావడానికి కూడా కారణం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనసూయ కరోనా సమయంలో చేసిన థాంక్యూ బ్రదర్ సినిమా నిర్మాతలు మరో చిత్రాన్ని తీశారు. అదే మాయా పేటిక. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను అనసూయ చేతుల మీద లాంచ్ చేయించారు. ఈ ఈవెంట్‌లో అనసూయ సందడి చేసింది. అనసూయ మాట్లాడుతూ సినిమాను పొగిడేసింది. నన్ను అందరూ సెల్ఫీష్ అని అంటారు.. సినిమాలో నేను లేకపోయినా కూడా సినిమా బాగుందని చెబుతున్నాను అంటే అర్థం చేసుకోండి అంటూ సినిమాను పొగిడేసింది.


మాయా పేటిక కాబట్టి.. అందరి సెల్ ఫోన్ సీక్రెట్ల గురించి హోస్ట్‌గా ఉన్న యాంకర్ రవి అడిగాడు. కానీ అనసూయను మాత్రం అడగలేదు. ఇదే విషయాన్ని అనసూయ స్టేజ్ మీద అడిగింది. అందరినీ అడిగావ్.. నన్ను మాత్రం ఎందుకు అడగలేదు అని నిలదీసింది అనసూయ. అడుగుదామని అనుకున్నా.. ఎన్నెన్నో ప్రశ్నలుండే.. కానీ మరిచిపోయాను.. ఎందుకొచ్చిన గొడవ అంటూ రవి సైలెంట్ అయిపోయాడు. 


నాదంతా కూడా ట్విట్టర్‌లోనే ఉంటుంది అన్నట్టుగా అనసూయ తన కాంట్రవర్సీల మీద తానే కౌంటర్లు వేసుకుంది. మొత్తానికి అనసూయకు, ట్విట్టర్‌కు మాత్రం మంచి రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమె వేసే ప్రతీ ట్వీట్ కాంట్రవర్సీగా మారుతుంటుంది. మొత్తానికి అనసూయ మాత్రం మాయా పేటిక ఈవెంట్లో సందడి చేసింది. సినిమా మీద బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. 


Also Read : Yashoda Movie Review : యశోద రివ్యూ.. సమంత.. మోసింది భారమంతా


Also Read : Nachindi Girlfriendu Movie Review : నచ్చింది గాళ్‌ఫ్రెండూ మూవీ రివ్యూ.. షేర్ మార్కెట్ల మోసాలపై గురి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook