Anasuya Bharadwaj celebrates Sankranthi festival with Family: ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). అనతి కాలంలోనే తన అందం, యాంకరింగ్‌తో బాగా  పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్ అయిన అనసూయ పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేయడమే కాకుండా.. సంప్రదాయ దుస్తుల్లో అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అను ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"219922","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రసారం అయిన జబర్దస్త్ షోలో అనసూయ భరద్వాజ్ సాంప్రదాయమైన లంగా ఓణీలో తళుక్కుమననున్నారు. ఆకుపచ్చ లంగాఓణీలో అనసూయ ఎంతో అద్భుతంగా ఉన్నారు. ముక్కు పుడక పెట్టుకుని నవ్వుతున్న ఆమె అభినయానికి అందరూ పడిపోయారు. ఇక లంగాఓణీలో అనసూయ నడుము వొంపులకు కుర్రకారు ఫిదా అయ్యారు. 


[[{"fid":"219923","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు (శనివారం) అనసూయ భరద్వాజ్ తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. ఇంటి దగ్గరలోని పార్కులో భర్త, పిల్లలతో కలిసి కైట్స్ ఎగురవేశారు. ఎర్రని చీరలో ఎరుపురంగు కైట్ పట్టుకుని నడుస్తున్న అను ఫొటో ఒకటి ఆహ అనిపిస్తుంది. పండగ పూట కుటుంబంతో ఎంజాయ్ చేసిన పోటోలను అను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 


Also Read: Acharya Official Announcement: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'ఆచార్య' సినిమా వాయిదా ! రిలీజ్ ఎప్పుడంటే..?


[[{"fid":"219924","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అనసూయ భరద్వాజ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ టీవీ షో, సినిమా, సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో రచ్చ చేస్తారు. పొట్టి దుస్తులు వేసినా, సారీ కట్టినా, లంగాఓణీ అయినా జబర్దస్త్ బ్యూటీ అందమే వేరు.  తాను ధరించే డ్రెస్సులపై నెటిజన్లు ఎన్ని కామెంట్లు చేసినా.. వారికీ ధీటుగా బదులు ఇస్తూ దూసుకుపోతారు. ఈ క్రమంలోనే ప్రతివారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో వెరైటీ డ్రెస్సులు వేస్తుంటారు. 


[[{"fid":"219925","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


టాలీవుడ్‌లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అను తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో గృహిణిగా తన నటనతో మెస్మరైజ్ చేసారు. తాజాగా వచ్చిన పుష్పలో కూడా మెప్పించారు. మొదటి భాగంలో అను పాత్ర ఉన్నది కాసేపే అయినా.. పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.


Also Read: Varun Tej Ghani: వరుణ్ తేజ్ 'గని' నుంచి రెండో సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన తమన్నా..


[[{"fid":"219926","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook