Anasuya Bharadwaj Reveals Reasons Behind Leaving Jabardasth: అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఒక రకంగా జబర్దస్త్ ద్వారానే సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఆమె చాలా కాలం పాటు జబర్దస్త్ లోనే కొనసాగింది. అయితే ఈ మధ్యనే ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పి జబర్దస్త్ నుంచి తప్పుకుంది. సుమారు 9 ఏళ్ల పాటు జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన అనసూయ భరద్వాజ్ అసలు షో నుంచి ఎందుకు బయటకు వచ్చేసింది అనే విషయం మీద క్లారిటీ లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ దీని గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. అయితే అనసూయ సినిమా షూటింగ్స్ తో పాటు జబర్దస్త్ షూటింగ్స్ ను మేనేజ్ చేయక పోవడం వల్లే ఆమె తప్పుకుందని కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా అనసూయ అసలు షో నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే విషయం మీద స్పందించింది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ షో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.


ఎందుకంటే చాలా సందర్భాలలో నా మీద వేసే పంచులు నచ్చక సీరియస్గా రియాక్షన్స్ ఇచ్చానని ఆమె వెల్లడించారు. తనకు బేసిగ్గా బాడీ షేమింగ్, వెకిలి జోకులు లాంటివి నచ్చవని చాలా సార్లు పంచులు నచ్చక ముఖం మాడ్చుకున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎడిటింగ్లో వాటిని తీసేసారని షోలో వేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి క్రియేటివ్ ఫీల్డ్ లో ఇలాంటివన్నీ తప్పవు కానీ నేను మాత్రం అలాంటి ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.


నాగబాబు, రోజా వెళ్ళిపోయారు కాబట్టి వారి బాటలోనే నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని, వాళ్ళు వెళ్లిపోయారు కదా అని వెళ్ళిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్ కాదని అన్నారు. తాను ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను, సినీ పరిశ్రమంలో చాలా అవకాశాలు వస్తున్నాయి అందుకే రెండింటినీ మేనేజ్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి షో నుంచి తప్పుకోవాలని అనుకున్నానని ఆమె అన్నారు. రెండేళ్ల నుంచి ప్రయత్నించి ఎట్టకేలకు ఇప్పటికి గుడ్ బై చెప్పాను అని ఆమె వెల్లడించారు.


Also Read: karthikeya 2: హిట్ టాక్ తో దూసుకుపోతున్న కార్తికేయ 2.. మొదటి రోజే భారీ వసూళ్లు!


Also Read: Macherla Niyojakavargam: కార్తికేయ 2 దెబ్బకు భారీగా పడిపోయిన మాచర్ల వసూళ్లు… ఎన్ని కోట్లు డ్రాప్ అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి