Rashmi Marriage News: యాంకర్ రష్మీ అంటే తెలియనివాళ్లెవరూ ఉండరు. అంతటి హాట్ నటి. అందం, అభినయంతో పాటు చలాకీగా, అందాల ఆరబోతతో వెర్రెక్కిస్తుంటుంది. ఇప్పుడీ అందాల తార రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త హల్‌చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుల్లితెర హాట్ నటిగా, యాంకర్‌గా రష్మి అందరికీ సుపరిచితం. అందం-అభినయంతో పాటు అవసరమైన చోట హొయలొలికించగలదు. అందుకే రష్మి బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో లీడ్‌రోల్స్ చేస్తున్న రష్మికి  సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే రష్మి-సుడిగాలి సుధీర్ మధ్య రిలేషన్ ఉందని..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అదే సమయంలో ఈ వార్తలో నిజం లేదని..స్టేజ్ వరకే ప్రేమికులమని కూడా సుధీర్, రష్మిలు (Rashmi) స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తే ఆసక్తి రేపుతోంది. అత్యంత రహస్యంగా రష్మి పెళ్లి జరిగిందనేది ఈ వార్త. మీరూ నమ్మలేకపోతున్నారా..


కరోనా మహమ్మారి(Corona pandemic)సమయంలో రష్మి పెళ్లి జరిగిందట. సినిమా పరిశ్రమకు సంబంధం లేని ఓ వ్యక్తితో ఇటీవల వివాహమైందని..కెరీర్ దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారనేది టాక్. టాక్ అంటే ఏదో మామూలుగా లేదు. భారీగానే ట్రోల్ అవుతోంది. రష్మిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడట. ప్రస్తుతానికి పెళ్లైతే రహస్యంగా చేసుకున్నా..త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సెలెబ్రిటీలు కెరీర్ కోసం పెళ్లిని దాచడం అలవాటే. గతంలో కూడా చాలామంది ఇలాగే చేసున్నారు. అయితే ఇప్పుడు రష్మి సీక్రెట్ మ్యారేజ్(Rashmi Secret Marriage) వార్తపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మరి సుధీర్ పరిస్థితి ఏంటని కామెంట్లు చేస్తున్నారు.ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే రష్మీనే ధృవీకరించాల్సి ఉంది. 


Also read: KGF2 vs Beast: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదా? '‘కేజీఎఫ్-2'’ టార్గెట్ కానుందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి