Anchor Lasya Became Pregnant Again: కొన్నాళ్ల క్రితం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వీడియో వదిలి అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్ లాస్య దంపతులు ఇప్పుడు తమ అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. లాస్య తను మరోసారి తల్లి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గతంలో ఈ జంటకు ఒక బాబు జన్మించగా ఇప్పుడు మరోసారి తన తల్లి కాబోతున్నానని, బేబీ ఇన్ ప్రోగ్రెస్ - సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటూ తన రెండో గర్భానికి సంబంధించిన విషయాన్ని యాంకర్ లాస్య అతను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో తెలుగులో అనేక టాక్ షోస్ లో యాంకర్ గా చేసిన లాస్య యాంకర్ రవితో కలిసి చేసిన కొన్ని షోల ద్వారా మంచి పేరు సంపాదించింది. తర్వాత అనూహ్యంగా యాంకరింగ్ కి దూరమైన ఆమె మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అలా తన పెళ్లి తర్వాత ఆమె మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. తనకు బాబు కూడా జన్మించిన తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎక్కువ కాలం హౌస్ లో కొనసాగ లేక పోయింది కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు తగినంత క్రేజ్ అయితే దక్కించుకోగలిగింది.


కొన్నాళ్ల క్రితం యాంకర్ లాస్య చేతికి సెలైన్ పెట్టి ఉన్న ఒక వీడియోని ఆమె భర్త తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో అసలు లాస్యకు ఏమైందో ఏమో అని అందరూ కంగారు పడ్డారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా యాంకర్ లాస్య తాను మరోసారి గర్భవతినయ్యానని త్వరలో రెండో బిడ్డకు జన్మనిస్తానని పేర్కొనడంతో ఆమె అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలువురు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, యాంకర్ లాస్య సన్నిహితులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగానే ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, అలాగే ఆమె విషయంలో తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Gautham Menon Counter: తెలుగు యాంకర్ ను ఆడుకున్న గౌతమ్ మీనన్..డౌట్ రాకుండా సీరియస్ కౌంటర్!


Also Read: Megastar Chiranjeevi's Voice Note: బజ్జే లేదనుకుంటే అన్ని ఛానల్స్ లో స్పెషల్ షోలే నడిచేలా చేశాడే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.