Jabardasth Anchor Sowmya in Sridevi Drama Company జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఆమె పంచ్‌లు, వచ్చీ రానీ తెలుగు మాటలు, ఆమెపై పడే కౌంటర్లు, ఆమె తిరిగి వేసే సెటైర్లు అన్నీ కూడా జనాలకు బాగానే నచ్చుతున్నాయి. అయితే ఆది, సౌమ్య ట్రాక్‌కు జనాలు బాగానే అలవాటు పడ్డారు. కానీ సడెన్‌గా ఆది మళ్లీ జబర్దస్త్ షోలో కనిపించకుండా పోయాడు. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని వచ్చేలా ఉన్నాడు. అయితే ఆది జబర్దస్త్‌లోకి వచ్చే కంటే.. సౌమ్యను శ్రీదేవీ డ్రామా కంపెనీకి తీసుకెళ్తే బెటర్ అని మల్లెమాల టీం ఆలోచించినట్టుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే ఇప్పుడు యాంకర్లలో కొదవ ఏర్పడింది. అనసూయ ఈ యాంకరింగ్ నుంచి తప్పుకుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్నింటికి రష్మీనే ఉండేది. ఈ మధ్యే జబర్దస్త్ కోసం కొత్త యాంకర్‌ను పట్టుకొచ్చారు. మంజూష, స్రవంతి చొక్కారపు వంటి వారి పేర్లు జబర్దస్త్ యాంకర్ రేసులో వినిపించాయి. కానీ చివరకు ఆ లక్కీ చాన్స్ సౌమ్యకు దక్కింది. భలే మంచి రోజు అనే ఈవెంట్లో సౌమ్య వేసిన పంచ్‌లు, కనిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.


 



దీంతో ఆమెను జబర్దస్త్ యాంకర్‌గా తీసుకున్నారు. తెలుగు అంతగా రాకపోయినా కూడా ఈ కన్నడ సుందరి తన గ్లామర్‌తో నెట్టుకొస్తుంది. తన చలాకీతనంతో ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె శ్రీదేవీ డ్రామా కంపెనీలో అడుగుపెట్టేసింది. యాంకర్ రష్మీ స్థానానికే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. తాను వస్తే పక్కకి వెళ్లాల్సిందే అన్నట్టుగా సౌమ్య కౌంటర్లు వేస్తోంది. ఇందులో సౌమ్య చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. 


సౌమ్య ఇచ్చిన పోటీని తట్టుకునేందుకు రష్మీ సైతం తనలోని గ్లామర్ యాంగిల్‌ను బయటకు తీయాల్సి వచ్చింది. నడుము బాగానే తిప్పుతూ సౌమ్యను తలదన్నేలా రష్మీ స్టెప్పులు వేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ టీంలో ఎవరు గెలిస్తే.. వారి టీం యాంకరే.. శ్రీదేవీ డ్రామా కంపెనీకి యాంకర్‌ అవుతారని ఇంద్రజ చెప్పింది. మరి ఇదంతా కేవలం ఎపిసోడ్, స్కిట్ కోసం చేశారా? లేదా నిజంగానే యాంకర్‌ను మార్చుతారా? అన్నది చూడాలి.


Also Read : Atlee wife Priya Pregnancy : తండ్రి కాబోతోన్న డైరెక్టర్ అట్లీ


Also Read : Upasana Surrogacy : సరోగసి ద్వారా బిడ్డను కంటోన్న ఉపాసన.. అసలు మ్యాటర్ ఇదా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook