Rashmi in Bhola Shankar: బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. టెలివిజన్ లో అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు రష్మీ. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడా ఆమెకు బంపర్ ఆఫర్ తగిలిందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేకమైన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం రష్మీ గౌతమ్ ఈ సినిమాలో ఓ సాంగ్ చేయబోతున్నట్లుగా చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది.


తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు ఈ సినిమా రీమేక్. అందులో అజిత్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: Jr NTR-Koratala Siva: రివేంజ్ డ్రామాతో ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రం


Also Read: Atrangi Re OTT Release: ఓటీటీ విడుదలకు సిద్ధమైన అక్షయ్, ధనుష్ ‘అత్రాంగి రే’


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook