Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్.. యాంకర్ జబర్దస్త్ రిప్లై
Anchor Rashmi on Amberpet Dig Issue అంబర్ పేట్లో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కుక్కల వల్ల సమాజంలో జరిగే ప్రమాదాలపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అయితే డాగ్ లవర్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు.
Anchor Rashmi Gautam Pet Lover: అంబర్ పేట్ ఏరియాలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచి వేసింది. అయితే కొంత మంది మాత్రం కుక్కలది తప్పేం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాటికి సరైన షెల్టర్, ఫుడ్ లేనందుకే అలా చేస్తుంటాయని అంటున్నారు. డాగ్ లవర్స్ అంతా కూడా బాలుడి మృతి పట్ల ఏ మాత్రం కనికరం కూడా చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు. అయితే రష్మీ మీద గత రెండ్రోజులుగా ఈ విషయంలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
పెట్ లవర్ అయిన రష్మీ మీద జనాలు ఎప్పుడూ ఏదో ఒక ముద్ర వేస్తూనే ఉంటారు. కొందరేమో యాంటీ హిందు అని అంటారు. అయితే రష్మీ మాత్రం సంక్రాంతికి కోళ్ల పందెలు వద్దని ట్వీట్ వేస్తుంది. అదే సమయంలో రంజాన్, బక్రీద్ సమయంలోనూ జంతువులను చంపకండని ట్వీట్ వేస్తుంది. జంతు ప్రేమికురాలిగానే రష్మీ ఎప్పుడూ స్పందిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ అంబర్ పేట్ కుక్కల దాడి విషయంలోనూ అలానే స్పందిస్తోంది. కుక్కల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
అయితే ఈ విషయంలో రష్మీ మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. రష్మీని యాంటి హిందూ అని అంటున్నారట. దీనిపై రష్మీ మండి పడింది. నేను గతంలో బక్రీద్ సమయంలో ఈ ట్వీట్ వేశాను. కానీ నాకు అప్పుడు ఎవరి నుంచి సపోర్ట్ రాలేదు. రంజాన్, బక్రీద్ పండుగలకు రక్తపాతం వద్దని, మేకలను చంపొద్దని వేడుకున్నాను. కానీ అప్పుడు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు మీ అందరి నోరు ఎందుకు లేస్తోంది అని రష్మీ నిలదీసింది.
మేకలు, ఆవులు వంటి వాటి వల్ల ఎక్కువగా హానీ జరగదు.. కానీ కుక్కల వల్ల ఎక్కువగా ప్రమాదం ఉంది.. అది మీకు కూడా తెలుసు.. అందుకే అలాంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహించకండి అని ఓ నెటిజన్ వేడుకున్నాడు. హైవేల్లో చూడు ఎన్ని ఆవులు, బర్రెల వల్ల యాక్సిడెంట్‌లు జరుగుతున్నాయో అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.
దీంతో రష్మీ ట్వీట్ మీద ఓ నెటిజన్ మండి పడ్డాడు. కుక్క రష్మీని కుక్కని కొట్టినట్టు కొట్టాలి అంటూ ట్వీట్ వేశాడు. దీంతో రష్మీకి చిర్రెత్తుకొచ్చినట్టుంది. సరే.. నీ అడ్రెస్ పంపు.. నేనే పర్సనల్‌గా వస్తాను.. నువ్ అప్పుడేం చేస్తావో చూస్తాను.. ఇదే నా ఓపెన్ చాలెంజ్ అంటూ జబర్దస్త్‌గా రిప్లై ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook