Anchor Shiva: రాశిఖన్నాతో పులిహోర.. ఏకంగా పెళ్లికి టెండర్ పెట్టాడుగా!
Anchor Shiva Flirts Rashi Khanna: తాజాగా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నాతో యాంకర్ శివ ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగానే రాశి ఖన్నాతో పులిహార కలపడానికి ప్రయత్నించాడు యాంకర్ శివ.
Anchor Shiva Flirts Rashi Khanna: సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలుగా మారిపోయారు అలాంటి వారిలో యాంకర్ శివ కూడా ఒకరు. యాంకర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన శివ తొలుత ఒక న్యూస్ ఛానల్లో డ్రైవర్ గా పని చేశాడు. అవకాశం రావడంతో యూట్యూబ్ చానల్స్ లో యాంకర్ గా మారిన శివ ఎక్కువగా కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు చేసి పేరు తెచ్చుకున్నాడు. యాంకర్ శివ ఇంటర్వ్యూ అంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుందనే ఒక బ్రాండ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిని గుర్తించి బిగ్ బాస్ నిర్వాహకులు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
అదేవిధంగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ కోసం యాంకర్ శివను కంటెస్టెంట్ గా రంగంలోకి దింపింది బిగ్ బాస్ యాజమాన్యం. శివ కూడా అసలు ఏమాత్రం ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వన్ టాప్ ఫైవ్ వరకు వెళ్లగలిగాడు. హౌస్ లో మనోడికి పులిహోర రాజా అనే పేరు ఏర్పడింది. దానికి కారణం వాళ్ళు వీళ్ళు అని లేకుండా అమ్మాయి అయితే చాలు అనే విధంగా పులిహోర కలపడమే. బిందు మాధవి మొదలు అరియానా, అషు రెడ్డి వంటి వారితో పులిహార కలిపగా, వాళ్లు దూరం పెట్టడంతో సైలెంట్ అయ్యాడు.. బిగ్ బాస్ సీజన్ ముగియడంతో మళ్లీ తన పాత వృత్తి యాంకరింగ్ మొదలుపెట్టాడు శివ.
తాజాగా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నాతో ఆయన ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగానే రాశి ఖన్నాతో పులిహార కలపడానికి ప్రయత్నించాడు యాంకర్ శివ. గతంలో మీ ఇంటర్వ్యూలు చూశాను అందులో మీరు మీకు కాబోయే భర్త ఒక మంచి భక్తుడై ఉండాలి అన్నారు కదా అంటే అవునని అంటుంది. దానికి నేను పెద్ద భక్తుడినని యాంకర్ శివ చెప్పుకొస్తే రాశి ఖన్నా సిగ్గుపడుతూనే ఏం చెప్పాలో తెలియక దీని గురించి మనం ఇంటర్వ్యూ అయ్యాక మాట్లాడుకుందాం అని అంటుంది.
అయితే భక్తుడు అవ్వడం కంటే ముందుగా ఒక కనెక్టివిటీ రావాలని, ఆ కనెక్టివిటీ ఎప్పుడు ఎవరితో ఎలా ఏర్పడుతుందనేది తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే నేను భక్తుడినే కానీ ఎవరి భక్తుడిని అని అడగరా అంటే ఎవరి భక్తుడు అని రాశి ప్రశ్నిస్తుంది. దానికి ఆయన మీ భక్తుడినని చెప్పుకొచ్చాడు. అయితే తాను పెళ్లి చేసుకునే వ్యక్తికి హార్ట్ ఉండాలని అంటే, నాకు చాలా పెద్ద హార్ట్ ఉందంటూ యాంకర్ శివ పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. అయితే రాశి ఖన్నా కూడా ఎక్కడా తగ్గకుండా మనోడికి ధీటుగా సమాధానాలు ఇచ్చిందనుకోండి, అది వేరే విషయం. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం ఇంటర్వ్యూ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చూడాల్సి ఉంది.
Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!
Also Read: Liger : లైగర్ న్యూడ్ పోస్టర్ పై సమంత, రష్మిక హాట్ కామెంట్స్.. అనుష్క కూడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook