Anchor Shyamala's husband Narasimha Reddy arrested in cheating case: ఓ చీటింగ్ కేసులో ఫేమస్ యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి అనే మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు. సింధూర వద్ద కోటి రూపాయ‌లు అప్పుగా తీసుకొని వాటిని తిరిగి చెల్లించడంలో ఆమెను మోసం చేశాడనే అభియోగాలపై (Cheating case) రాయ‌దుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన న‌ర‌సింహా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో తాజాగా బెయిల్‌పై విడుదలైన నరసింహా రెడ్డి కేసుపై జరుగుతున్న అనేక ప్రచారాలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో తనపై అనేక అవాస్తవ కథనాలు వస్తున్నాయని, కానీ వాస్తవానికి వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని నరసింహా రెడ్డి ఈ వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. త్వరలోనే అన్ని ఆధారాలతో జనం ముందుకు వస్తానని చెబుతున్న నరసింహా రెడ్డి (Anchor Shyamala husband Narasimha Reddy) ఇంకా ఏమేం చెప్పాడో ఆయన మాటల్లోనే విందాం.



Also read : Pawan Kalyan లేటెస్ట్ సూపర్ హిట్ Vakeel Saab మూవీ OTTలో విడుదల


తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నమ్మకుండా తమకు అండగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అని చెప్పిన నరసింహా రెడ్డి... తాను ఏ తప్పూ చేయలేదనడానికి తనకు త్వరగా బెయిల్ రావడమే నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. నరసింహా రెడ్డి వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యాంకర్ శ్యామల (Anchor Shyamala).. అసలు నిజం ఏంటో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తుందని, అప్పటివరకు తమకు అండ‌గా నిలిచిన వారికి కృతజ్ఞతలు అని తన పోస్టులో పేర్కొంది. నరసింహా రెడ్డి తనకు అనుకూలంగా తీసుకొచ్చే ఆ ఆధారాలు ఏంటో తెలియాలంటే ఆయనే మరోసారి ఇలా పబ్లిక్ ముందుకొచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook