Suma Turns Kumari Aunty: ఒకప్పుడు సెలబ్రిటీలు చెప్పిన డైలాగ్స్ లేదా సాంగ్స్ బాగా క్లిక్ అయితే వాటికి వీడియోస్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.. ఆడియన్స్ చేసి బాగా క్లిక్ అయిన పనులను సెలబ్రిటీలు ఇమిటేట్ చేసి తమ ప్రమోషన్స్ కి వాడుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం చిత్రంలో కుర్చీ తాత డైలాగ్ ను బాగా వాడుకొని కుర్చీ మడత పెట్టి సాంగ్ ని కంపోజ్ చేసేసారు. ఈ సాంగ్ ఏ రేంజ్ వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఎంతోమంది ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ ని వాడేస్తున్నారు. ప్రస్తుతం సుమక్క కూడా ఇదే ఫాలో అయిపోతుంది.


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలుసు. నీది 200 అయ్యింది.. నీకు లివర్ ఫ్రై ఎక్స్ట్రా .. ఇలాంటి మాటలు ప్రస్తుతం ఎక్కడన్నా వినిపిస్తే వెంటనే ఆ రీల్ కుమారి ఆంటీది అని అందరూ గుర్తుపట్టేస్తారు. ఆ రేంజ్ లో కుమారి ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయ్యింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె షాప్ సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించడంతో.. ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. రీసెంట్గా సందీప్ కిషన్ మూవీ ప్రమోషన్స్ లో.. బిగ్‌బాస్ ఉత్సవ సెలబ్రేషన్స్ లో కుమారి ఆంటీ కనిపించి సందడి చేసింది.


ఇక ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ యాంకర్ సుమ.. కుమారి ఆంటీ ని ఇమిటేట్ చేస్తూ ఓ ఇన్‌స్టా రీల్ చేసి పోస్ట్ చేసింది. ఈ రీల్ లో బ్రహ్మాజీ ఎక్స్ప్రెషన్స్ ను మిక్స్ చేసి మేషప్ వీడియో లాగా చేశారు. అందరికీ భోజనాలు వడ్డిస్తూ కుమారి ఆంటీ స్టైల్ లో మాట్లాడుతున్న సుమ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయింది. తన ఫన్నీ వీడియోస్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సుమ ఈసారి కూడా తన వీడియోతో అందరిని బాగా మెపించారు. 


 



ఈ నేపథ్యంలో ఈ వీడియోకి బ్రహ్మాజీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అని నెటిజెన్లు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ పెట్టే ట్వీట్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంత సీరియస్ విషయం అయినా తనదైన కామిక్ స్టైల్ లో సూపర్ గా కన్వే చేస్తాడు బ్రహ్మాజీ. మరి సుమ పెట్టిన ఈ వీడియో పై అతను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.


Also Read: Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter