Anchor Suma Rajeev Kanakala Ad యాంకర్ సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రాజీవ్ కనకాల మంచి ఆకలి మీదున్నట్టుగా చూపించారు. ఇక ఫియా ఫుడ్‌ను ప్రమోట్ చేసింది. రకరకాల పచ్చళ్లు అంటూ చూపించింది. వాటిని తింటూ భలే ఉన్నాయని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. తన పేరు మీదున్న కూపన్ వాడుకుంటూ ఆఫర్ వస్తుందని కూడా సుమ తెలిపింది. ఈ వీడియో మీద నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటివి చేయకండని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నుంచి సుమ ఈ ఫుడ్ సంస్థకు ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. కరోనా సమయంలోనూ ఇలాంటి వీడియోలను షేర్ చేసింది. ఫుడ్ ఎంతో రుచికరంగా ఉంటుందని, వెంటనే ఆర్డర్ పెట్టుకోండంటూ ఇలా నానా రకాలు ప్రమోట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తన భర్తను కూడా ఈ యాడ్ కోసం తీసుకొచ్చింది. రాజీవ్ కనకాలతోనూ ప్రమోట్ చేయించింది.


 



తాజాగా నెటిజన్లు ఈ ప్రమోషనల్ వీడియో మీద ఫైర్ అవుతున్నారు. ఫుడ్ ఏం బాగుండటం లేదని, పాకింగ్ కూడా సరిగ్గా ఉండదని, వచ్చే లోపు చెడిపోతోన్నాయని, టేస్ట్ ఏం బాగుండటం లేదని ఇలా నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రమోషన్లు చేయకండంటూ నెటిజన్లు కోరుతున్నారు. డబ్బుల కోసం ఇలా ఇష్టమున్న ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయకండని సూచించారు.


Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్


యాంకర్ సుమ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బుల్లితెర షోలు, సినిమా ఈవెంట్లు, ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లో ఆడకపోయినా ఓటీటీలో బాగానే రన్ అయింది. ఇప్పుడు సుమ తన కొడుకు రోషన్‌ను హీరోగా నిలబెట్టేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.


Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook