Suma Rajeev Kanakala Wedding Anniversary యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పెళ్లి, ప్రేమ సంగతులు అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం వింత వింత రూమర్లు వస్తుంటాయి. ఈ ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని, విడాకులు తీసుకున్నారంటూ రూమర్లు వస్తుంటాయి. ఈ రూమర్లను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా వీరిద్దరూ తమ తమ పెళ్లి రోజును వెరైటీగా సెలెబ్రేట్ చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇరవై నాలుగేళ్ల వివాహా బంధమంటూ చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరూ ఒకే చోట లేకపోవడంతో ఇలా వీడియో కాల్ ద్వారా సెలెబ్రేట్ చేసుకున్నట్టుగాన్నారు. ఇద్దరూ కలిసి ఓ పాట రూపంలో తమ బంధాన్ని చూపించారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటిక్కడ.. పలుకక్కడ అంటూ సుమ పాడితే.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా అంటూ రాజీవ్ కనకాల పాడేశాడు. ఈ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క వీడియో చాలు అన్నట్టుగా ఉంది.


అయితే సుమ, రాజీవ్ మధ్య ఇంత మంచి బంధం ఉన్నా కూడా ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ప్రచారంలోకి వస్తుంటుంది. రాజీవ్ కనకాల అయితే ఈ రూమర్ల మీద సీరియస్ అవుతుంటాడు. ప్రతీ భార్యభర్తల మధ్య వచ్చే గొడవలే తమ మధ్య కూడా ఉంటాయని, మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే అంత పెద్దగా లేవని, ఇద్దరం విడిపోయే అంత కూడా గొడవలు లేవని ఇలా క్లారిటీగా చెబుతుంటాడు. కానీ రూమర్లు మాత్రం ఆగవు.


పిల్లల కోసమే ఈ ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారని ఇంకో కొత్త రూమర్ బయటకు వచ్చింది. ఇప్పుడు సుమ తన కొడుకు రోషన్‌ను హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అయిందన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనే ఆ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించిన విషయం విదితమే.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి