Bigg Boss Samrat in Cash Latest Promo బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న సామ్రాట్ చివరి వరకు పోటీలో నిల్చాడు. మంచి ఇమేజ్‌తో బయటకు వచ్చాడు. అయితే అతని పర్సనల్ లైఫ్, ఫస్ట్ మ్యారిడ్ లైఫ్‌లోని కాంట్రవర్సీలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు రెండో పెళ్లి తరువాత సామ్రాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కొత్త కారు కొన్నాడు. ఈ మధ్యే కొత్త ఇంట్లోకి కూడా అడుగుపెట్టేశాడు. ఇప్పుడు సామ్రాట్ తన భార్య లిఖితతో కలిసి సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో కమెడియన్ విద్యుల్లేఖ ఆమె భర్త, పవన్ తేజ్‌ కొణిదెల మేఘన, అలీ రెజా మసూమ, సామ్రాట్ శ్రీ లిఖితలు గెస్టులుగా వచ్చారు. ఇక ఇందులో ఎక్కువగా విద్యుల్లేఖ కామెడీ చేసింది. తాను అలియా భట్ అని తన భర్త రణ్‌ బీర్ కపూర్ అని కామెడీ చేసింది. గర్భం దాల్చినప్పుడు అలియా భట్ తనలానే ఉందని కౌంటర్లు వేసింది.


 



ఇక సుమ అయితే జంటలను ఇరికించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఓ రౌండ్ ఆడించింది. అందులో ఇద్దరూ యస్ ఆర్ నో బోర్డ్ చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సామ్రాట్, శ్రీ లిఖితలను కూర్చోబెట్టిన సుమ.. వారి వారి పర్సనల్ జీవితాల్లోని ఎఫైర్ల గురించి అడిగేసింది.


పెళ్లికి ముందు మీకు వేరే లవ్ స్టోరీస్ ఉన్నాయ్? అని సుమ అడిగేసింది. దీనికి సామ్రాట్, శ్రీ లిఖిత ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఇద్దరూ యస్ అని చెబుతారా? లేదంటే నో అని చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రోమో అయితే మంచి కంటెంట్ ఇచ్చింది. పూర్తి ఎపిసోడ్ ఇంకెలా ఉంటుందో చూడాలి.


సామ్రాట్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో కనిపించేవాడు. బావ, పంచాక్షరి వంటి సినిమాలు సామ్రాట్‌కు మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇప్పుడు బుల్లితెర, వెండితెర ఎక్కడా కూడా కనిపించడం లేదు.


Also Read : Sridevi Chiranjeevi Song : బాస్ గ్రేస్ అదుర్స్.. దేవీ బీట్ సూపర్.. శ్రుతి అందాలు హైలెట్


Also Read : Kannada Star Darshan : స్టార్ హీరో దర్శన్‌పై చెప్పు విసిరిన ఆకతాయిలు.. బాధ కలిగించిందన్న శివ రాజ్‌కుమార్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook