Anchor Suma Quitting Mallemala యాంకర్ సుమ అంటే బుల్లితెర.. బుల్లితెర వినోదం అంటే అది సుమ... అలా అంతటి బంధాన్ని పెనవేసుకుంది. అలాంటి సుమ ఒక్కసారిగా బుల్లితెరకు దూరంగా ఉండబోతోందనే వార్తలు వచ్చాయి. దానికి కూడా ఓ కారణం ఉంది. ఈటీవీలో న్యూఇయర్ వేడుకకు సంబంధించిన వేర్ ఈజ్ ది పార్టీ అనే షోలో సుమ సందడి చేయబోతోంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలో సుమ కాస్త ఎమోషనల్ అయింది. తెలుగు వారి అభిమానం గురించి చెప్పుకుని కంటతడి పెట్టేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళీ అయినా తనని ఇంతలా ప్రేమించి, ఆదరించారని, కానీ ఇప్పుడు విరామం తీసుకుంటున్నాను అని సుమ చెబుతూ ఎమోషనల్ అయింది. దీంతో బుల్లితెరకు సుమ పూర్తిగా దూరం కాబోతోందనే వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఆ సెగ ఆమెకు తాకింది. దీంతో సుమ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.


[[{"fid":"257495","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇందులో సుమ అసలు విషయాన్ని చెప్పేసింది. హలో.. రీసెంట్‌గా ఓ న్యూఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది.. దాని ప్రోమో కూడా రిలీజ్ చేశాం.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఎమోషనల్ అయినటువంటి మాట వాస్తవమే..అది ఏంటో ఎపిసోడ్ చివర్లో తెలుస్తుంది.. కంగారు పడకండి.. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు.. మెసెజ్‌లు చేస్తున్నారు.. నేను బుల్లితెర కోసమే పుట్టాను.. ఎంటర్టైన్ కోసమే పుట్టాను.. నేను ఎటూ వెళ్లడం లేదు.. కాబట్టి మీరు హాయిగా ఉండండి.. హ్యాపీగా ఉండండి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని సుమ క్లారిటీ ఇచ్చింది.


అయితే ఈ వీడియోను మాత్రం సుమ వెంటనే ట్విట్టర్ నుంచి డిలీట్ చేసింది. ఎందుకు అలా ట్వీట్‌ను డిలీట్ చేసింది అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏది ఏమైనా లోలోపల మాత్రం ఏదో జరుగుతోందని తెలుస్తోంది. ఈ వీడియోలో సుమ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. అంటే బుల్లితెరపై ఉంటుంది కానీ.. మల్లెమాలలో ఉండదేమో అని జనాలు అనుకుంటున్నారు. స్టార్ మా, జీ తెలుగులో ఇతర షోలను సుమ ఒప్పుకున్నట్టుంది.. అందుకే ఇలా మల్లెమాల, ఈటీవీ షోలకు దూరంగా ఉండబోతోందా? అనే అనుమానం పుట్టికొచ్చేసింది నెటిజన్లకు. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



Also Read : Pawan Kalyan Marriages : పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ స్పందన.. కుక్కలే అంటూ బాలయ్య కౌంటర్లు


Also Read : Sreeja Konidela Daughter : నవిష్క బర్త్ డే.. కూతురితో దగ్గరగా, ఆనందంగా శ్రీజ.. దూరంగా కళ్యాణ్‌ దేవ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook