Anchor Suma Reveals Energy secret యాంకర్ సుమ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ వారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, బుల్లితెరపై షోలంటూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు సుమ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ కూడా బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇలా కంటిన్యూగా అలసిపోకుండా పని చేయడం ఎక్కడి నుంచి నేర్చుకుందో దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



సుమ తన అమ్మ గురించి ఇన్ స్టాగ్రాంలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎనభై ఏళ్ల వయసులోనూ సుమ అమ్మ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరూ చూస్తుంటారు. ఇక అమ్మ ఎనర్జీయే తనకు వచ్చిందని చెబుతుంటుంది. తాజాగా సుమ తన తాతగారిని చూపించింది. అమ్మకు మామయ్య అంటూ తన తాత గురించి చెప్పింది. శ్రీ పీ.బీ. మీనన్‌కు ఇప్పుడు 97ఏళ్లు.. అయినా కూడా పాలక్కడ్ హై కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.. ఆయన మా అమ్మకు మామయ్య.. నాకు తాతగారు.. ఇప్పుడు మీకు నా జీన్స్ గురించి అర్థమైందనుకుంటాను.. సౌత్ కేరళ మొత్తంలో అత్యంత వృద్ద నాయవ్యాది మా తాతగారే అంటూ సుమ చెప్పుకొచ్చింది.


సుమ గత ఏడాది జయమ్మ పంచాయితీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల తరువాత ఇలా ఓ లీడ్ కారెక్టర్‌ను పోషించింది. ఉత్తరాంధ్ర యాసలో సుమ అదరగొట్టేసింది. థియేటర్లో ఈ చిత్రం ఆడకపోయినా కూడా ఓటీటీలో జనాలను మెప్పించింది. ఇక మళ్లీ సుమ సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది తెలియడం లేదు. కానీ ఆ మధ్య రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చర్చల్లో ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.


Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?


Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook