Suma Adda Show Promo బుల్లి తెర లేడీ సూపర్‌ స్టార్‌ గా సుమకు పేరుంది. అలాంటి సుమను యాక్షన్‌ హీరో గోపీచంద్‌ గొంతు పట్టుకోవడం చర్చనీయాంశం అయ్యింది. సుమ గొంతును హీరో గోపీచంద్‌ ఎందుకు పట్టుకున్నాడు అనేది తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం తెగ ప్రచారం జరుగుతోంది. సుమ ఫ్యాన్స్ ఈ విషయమై గోపీచంద్‌ పై తీవ్రంగా స్పందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇదంతా కూడా టీఆర్‌పీ రేటింగ్ జిమ్మిక్కు అంటూ కొట్టి పారేస్తున్నారు. సుమ ఇలాంటివి తన గత షో ల్లో చాలా చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేక్షకులు వీటిని ఇంకా కూడా నమ్మి మోసపోతారు అనుకుంటున్నారు.. షో ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఇలాంటి రొటీన్ ఫ్రాంక్ కాన్సెప్ట్‌ లు ఇంకా ఎంత కాలం వాడుతారు అంటూ కొందరు కౌంటర్‌ ఇస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సుమ ప్రస్తుతం సుమ అడ్డా అనే షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు చిరంజీవి సైతం వచ్చాడు. తన వాల్తేరు వీరయ్య సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.


ఇప్పుడు ప్రతీ చిత్రయూనిట్ ఈ షోకు వస్తోంది. చివరకు నాని కూడా తన టీంతో వచ్చాడు. ఇప్పుడు గోపీచంద్ తన రామబాణం టీంతో వచ్చాడు. ఈ సినిమాను మే 5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా యూనిట్‌ ఈ షోకు వచ్చింది. ఈ షో లో ఎక్కువగా సినిమాల ప్రమోషన్ కోసం వస్తున్నారు. ఇక నెక్ట్స్ వారం ఈ షోలో 'రామబాణం' చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేశారు. 


 



హీరో గోపీచంద్‌, దర్శకుడు శ్రీవాస్, హీరోయిన్‌ డింపుల్ ఇంకా కమెడియన్ గెటప్ శ్రీనులు సుమ అడ్డ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌ ను 29వ తారీకున టెలికాస్ట్‌ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ప్రోమో చివర్లో యాంకర్ సుమ యొక్క గొంతును గోపీచంద్‌ పట్టుకోవడం అంతా షాక్ అవ్వడం చూపించారు. 


Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ


సుమను మొహం, మేకప్ మీద కూడా గోపీచంద్ కౌంటర్లు వేశారు. వెళ్లవయ్యా వెళ్లు అని సదా స్టైల్లో సుమ అంటే.. ఇంత దగ్గరి నుంచి మీ మొహం చూశాకా వెళ్లకుండా ఉంటారా? అని గోపీచంద్ అనడంతో సుమ షాక్ అయింది. ఇలా సరదాగా సాగుతున్న షోలో సుమ గొంతును గోపీచంద్ పట్టుకున్నాడు. ఇది జయం సినిమా స్పూప్ అనిపిస్తోంది. కానీ టీఆర్పీ కోసం ఇలా కట్ చేసి వైరల్ చేసి ఉంటారని నెటిజన్లు అనుకుంటున్నారు.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook