Tiger Nageswara rao: మాస్ మహారాజా రవితేజ(Raviteja) లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara rao). స్టువర్ట్‌ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని వంశీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజై మాంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రచార చిత్రంలో వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి టీజర్లతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ.. ఈ మూవీ మేకర్స్ ను నిలదీసింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఓ సామాజికవర్గ మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్టుపురం గ్రామప్రజల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ చుక్కా పాల్‌రాజ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు అంకాళ్ల పృథ్వీరాజ్‌, శృంగారపాటి కార్తీక్‌ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను సెప్టెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది.


1970ల్లో స్టువర్ట్‌ పురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, రేణుదేశాయ్, గాయత్రీ భార్గవి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook