Animal Box Office: బాక్సాఫీస్ పై కొనసాగుతున్న రణ్‌బీర్ దండయాత్ర... రూ.500 కోట్ల క్లబ్లో `యానిమల్`...
Animal Collections: రణబీర్ `యానిమల్` బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Animal Movie Box Office Collections Day 6: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’(Animal) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ రూ. 500 కోట్ల మార్కును క్రాస్ చేసింది. తొలి రోజు రూ. రూ.116 కోట్లు, రెండో రోజు రూ. 236 కోట్లు, మూడో రోజు రూ. 356 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ తాజాగా వరల్డ్‌వైడ్‌గా రూ.527 కోట్లు వసూలు చేసింది. కేవలం ఈ సినిమా ఇండియాలోనే దాదాపు రూ.313 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. యానిమల్ సినిమాకు బుధవారం 34.88 శాతం హిందీ ఆక్యుపెన్సీ, 25.67 శాతం తెలుగు ఆక్యుపెన్సీ, 18.95 శాతం తమిళ ఆక్యుపెన్సీ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వం వహీంచిన ఈ సినిమాలో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రల్లో కనిపించారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్‌లు కొట్టిన తర్వాత సందీప్ నుంచి వస్తున్న కావడంతో యానిమాల్ పై వీర లెవల్లో అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే యానిమల్ కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే రణబీర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సంజు (రూ. 586.85 కోట్లు గ్రాస్) సినిమాను యానిమల్ అధిగమించే అవకాశం ఉంది.
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సూపర్ హిట్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీతోపాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ థియేటర్ వెర్షన్ కంటే 20నిమిషాలు ఎక్కువగా ఓటీటీ వెర్షన్ ఉండబోతుందని సమాచారం.
Also Read: Hi Nanna OTT: 'హాయ్ నాన్న' ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ కు వచ్చేది ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి