Bahishkarana Web Series: అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో యాక్ట్ చేసిన బహిష్కరణ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీతో సూపర్ హిట్ అందుకున్న అంజలి.. బహిష్కరణ  వెబ్ సిరీస్‌లో సరికొత్త పాత్రలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రామీణ కక్షల బ్యాక్‌డ్రాప్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో పుష్ప అనే వేశ్య పాత్రలో అంజలి యాక్ట్ చేసింది. ఈ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Guru Purnima 2024: తిరుమలను మించిన షిర్డీసాయి ఆదాయం.. గురు పౌర్ణమి ఒక్కరోజే ఏకంగా..  


ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. బహిష్కరణ వెబ్‌ సిరీస్‌లో పుష్ప పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుందని తెలిపారు. రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో న‌టించడానికి తాను ఎంజాయ్ చేశానని చెప్పారు. పుష్ప పాత్ర‌లో చాలా డెప్త్ ఉందని.. ఈ పాత్ర‌లో భావోద్వేగాలను చాలా పవర్‌ఫల్‌గా చూపించారని అన్నారు. మొదట్లో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేసేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించిందని.. అలాంటి రోల్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. బోల్డ్ సీన్‌లో నటించిన తరువాత ఓ సారి చాలా ఎమోషనల్ అయ్యానని.. ఎందుకంటే ఇలాంటి సీన్స్‌లో నటించడం తొలిసారి అని చెప్పారు. బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేసేందుకు ముందుగా తాను ప్రీపేర్ కాలేదన్నారు. అయితే ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ పాత్రలో నటించానని చెప్పుకొచ్చారు. 


పుష్ప రోల్‌లో బోల్డ్‌గా న‌టించటం కొత్తే అయినా.. తాను చేస్తున్న పాత్ర‌పై, దాన్నెలా చేయాల‌నే దానిపై తనకు అవ‌గాహ‌న ఉందన్నారు అంజలి. అందువ‌ల్లే ఆ పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. తాను ఆ బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేసేటప్పుడు సెట్స్‌లో చాలా త‌క్కువ మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ ముఖేష్‌ ప్రజాపతి ఈ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకోవడంతో కంఫ‌ర్ట్‌గా న‌టించ‌గ‌లిగానని అన్నారు. 


జీ5లో బహిష్కరణ వెబ్‌ సిరీస్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్ అయిన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవడం విశేషం. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద క్యారెక్టర్‌ను ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ ఆకట్టుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ఓ పల్లెటూరుకు అంజలి (పుష్ప) ఎందుకు వచ్చింది..? ఆమెకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ ఊరికి వచ్చింది..? వచ్చిందనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో రూపొందించారు. ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించగా.. సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వర్క్ చేశారు.


Also Read: 7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి