Bhanu singing in Sridevi Drama Company : శ్రీదేవీ డ్రామా కంపెనీ ఈ మధ్య ఫుల్ ట్రెండ్ అవుతోంది. సుధీర్ రాక ముందు ఒకలా ఉన్న షో.. అతను వచ్చాక టాప్ ప్లేసులోకి వెళ్లింది. ఇక సుధీర్ బయటకు వెళ్లాక అతని స్థానంలో రష్మీ వచ్చి షోను నడిపించింది. ఆది, రాం ప్రసాద్‌లు ఇద్దరూ షోను భుజాన వేసుకున్నారు. వర్ష, నరేష్‌, ఇమాన్యుయేల్, బుల్లెట్ భాస్కర్, రీతూ ఇలా అందరినీ మల్లెమాల టీం ఈ షో కోసం వాడేస్తోంది. అయితే ఇప్పుడు ఈ షోలో ఓ ఘట్టం మాత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారం నుంచి శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో, అందులో భాను పాట పాడిన తీరు, ఆ గొంతుని సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. గెలుపు తలుపులే అంటూ శ్రీరామచంద్ర ఎంత డెప్త్‌గా పాడాడో.. మణిశర్మ బాణీ ఎంత హాయిగా ఉంటుందో.. భాను పాడటంతో ఉన్నదంతా పోయిందని, చిరాకు వస్తోందంటూ భాను మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది.


 



ఇవన్నీ ఒకెత్తు అయితే భాను పాడిన పాటను విని.. ఇంద్రజ ఇచ్చిన కాంప్లిమెంట్ మరింత ఎక్కువగా ట్రోల్ అయింది. పాటలో ఉన్న డెప్త్ ఆమె పాటలో కనిపించింది అంటూ పొగిడేసింది. దీంతో ఇంద్రజ మీద కూడా దారుణంగా ట్రోల్స్ పడ్డాయి. అయితే ఇదంతా ప్రోమోలో ఉంది. కానీ నిజంగా ఎపిసోడ్‌లో లేదు. భయపడి ఎడిటింగ్‌లో లేపి అవతల పారేసినట్టున్నారు.


మొత్తంగా తీసేస్తే పరువుపోతుందని అనుకున్నారో ఏమో గానీ.. భాను పాట పాడిన తీరుకు జరిగిన డ్యామేజ్‌ను పసిగట్టినట్టున్నారు. గెలుపు తలుపులే అంటూ మొదలుపెట్టిన వెంటనే ఎడిట్‌లో లేపేశారు. అంతకు ముందు కరెంట్ తీగ పాటను పాడి కూనీ చేసింది. భాను మాత్రమే కాదు మిగతా ఇద్దరు ముగ్గురూ కూడా పాటలు పాడి.. జీవితంలో పాటలు అంటే భయపడేలా చేశారు.
 
దీంతో నెటిజన్లు ఈ ఎపిసోడ్ మీద కామెంట్లతో తమ పగ తీర్చుకుంటున్నారు. ఒక్కో పాట ఒక్కో డైమండ్ లా ఉంది, భాను శ్రీ తో పాడించిన ఆ మహానుభావుడు ఎవరు బాస్ ఆ మహానుభావుడికి నా పెద్ద దండం, ట్రోల్స్ చేసుకునేందుకు మంచి కంటెంట్ ఇచ్చారు బాస్ మీరు సూపర్, భాను శ్రీ పాట లైవ్ గా విన్న వాళ్లకు చెవుల్లోంచి రక్తం ఆ నొప్పికి కళ్ళలో నీళ్లు ఒకే సారి వచ్చాయి, అందుకే అందరి కళ్ళూ తడిగా ఉన్నాయి ఇలా నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.


Also Read : Siri-Shrihan : శ్రీహాన్ లవర్‌ను ఎత్తుకున్న మానస్.. బిగ్ బాస్ బ్యూటీ సిరి పిక్స్ వైరల్


Also Read : Krishna Demise: తెలుగు సినిమాకు సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు చేసిన చేసిన కృష్ణ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook