Annapurna Studios: మొదట సినీ పరిశ్రమ చెన్నెలో ఉండేది. అక్కడి నుంచి హైదరాబాద్‌ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సినీ పరిశ్రమను తెలుగు ప్రాంతానికి తీసుకురావడానికి సినీ ప్రముఖులంతా తీవ్రంగా శ్రమించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో అప్పుడప్పుడే నిర్మాణాలు మొదలవుతున్నాయి. నగరమంతా కొండలు, గుట్టలు, అడవితో నిండిపోయి ఉండేది. సినీ పరిశ్రమను నెలకొల్పడానికి అప్పట్లో నాటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వర్‌ రావు ముందడుగు వేశారు. అడవి ప్రాంతంలో కారుచౌకగా భూములు కొన్నారు. అప్పుడు అడవిలో ఏం చేస్తారని కొందరు హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతం కొన్ని వందల కోట్లు పలుకుతోంది. అన్నపూర్ణ స్టూడియో ఆస్తులు చాలా ఆసక్తిగా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Snake Bite: సినిమా షూటింగ్‌లో కరిచిన పాము.. స్టార్‌ హీరోయిన్‌ దిగ్భ్రాంతి


హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ స్థాపించేందుకు.. ఇక్కడ స్టూడియో ఏర్పాటుకు నాగేశ్వర రావు ముందుకువచ్చారు. దీంతో 1976లో అప్పటి ప్రభుత్వం 22 ఎకరాలు ప్రస్తుత జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో అక్కినేని నాగేశ్వర రావుకు కేటాయించింది. అప్పుడు ఎకరా కేవలం రూ.7,500 నుంచి రూ.8 వేలకు కొన్నారని సమాచారం. మొత్తం 22 ఎకరాలు కనీసం రూ.లక్షన్నర కూడా విలువ చేయలేదు. రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షలు మాత్రమే ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌


ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్కినేని నాగేశ్వర రావు అతి కష్టపడి స్టూడియో నిర్మించారు. దానికి తన భార్య పేరు మీద 'అన్నపూర్ణ స్టూడియో' అని పెట్టారు. ప్రస్తుతం ఆ స్టూడియో ఉన్న ప్రాంతంలో భారీగా భూముల ధరలు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న భూమి ఎకరా రూ.30 కోట్లు పలుకుతోంది. అంటే 22 ఎకరాలకు కలిపి రూ.600 నుంచి రూ.650 కోట్ల దాకా విలువ చేస్తుందని సమాచారం. భూమి విలువ రూ.లక్షన్నర నుంచి వందల కోట్లకు చేరడం విస్మయానికి గురి చేస్తోంది.


కాగా అన్నపూర్ణ స్టూడియో ద్వారా సినీ పరిశ్రమ మద్రాస్‌ ప్రస్తుత నేటి చెన్నై నుంచి తెలుగు నేలపైకి వచ్చి నిలబడింది. ఈ స్టూడియో ద్వారా 271 సినిమాలు నిర్మితమయ్యాయి. అన్నపూర్ణ స్టూడియో ఎంతో మంది కళాకారులు, నిపుణులను సినీ పరిశ్రమకు అందించింది. వేలాది మంది ఈ స్టూడియోను నమ్ముకుని పొట్ట నింపుకుంటున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నపూర్ణ స్టూడియోను ఇప్పుడు రిలయన్స్‌ మీడియా వర్క్స్‌ కొనుగోలు చేసిందని సమాచారం. అనిల్‌ అంబానీ అన్నపూర్ణ స్టూడియోను చేజిక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే అన్నపూర్ణ స్టూడియో విలువ తెలిసింది.

కేవలం భూమి విలువనే దాదాపు రూ.700 ఉండగా.. ఇక స్టూడియోలోని నిర్మాణాలు, పరికరాలు వంటివి అన్నీ కలిపి దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా విలువ ఉంటుందని వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి. స్టూడియోను సొంతం చేసుకుని దేశంలోనే రెండో అతిపెద్ద సినీ పరిశ్రమగా మార్చాలని రిలయన్స్‌ మీడియా వర్క్స్‌ లక్ష్యంగా పెట్టుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి