Jayam Ravi Divorce: తమిళ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎదిగిన జయం రవి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో రెండు మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన జయం రవి.. తమిళ్ లో ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ హీరో.. 2009లో ఒక ప్రముఖ టెలివిజన్ నిర్మాత కూతురు.. ఆర్తిని పెళ్లి చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీళ్ళిద్దరికీ ఇద్దరు మగ పిల్లలు.. కూడా జన్మించారు. అందులో ఒకరు 2018 లో జయం రవి.. నటించిన టిక్ టిక్ టిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి ఎప్పటికప్పుడు తన భర్త పిల్లలతో.. ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. 


సోషల్ మీడియాలో ఆర్తికి ఫాలోయింగ్ ఎక్కువే. కానీ తాజాగా ఆర్తి.. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య ఒకరి తర్వాత.. ఒకరు సెలబ్రిటీలు ముందుగా సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసి, తర్వాత పేర్లు మార్చుకొని, ఆ తరువాత విడాకులు ప్రకటిస్తున్నారు. 


ప్రస్తుతం చూస్తూ ఉంటే ఆర్తి కూడా ఇలానే చేయబోతున్నారా అని అనిపిస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో.. ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ తాజాగా ఆర్తి రవి.. తమ ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. 


అయితే దీనికి సంబంధించిన.. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు. దీంతో ఈ వార్తలు నిజం అయి ఉండవు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు.. తెలియాలంటే జయం రవి లేదా ఆర్తి రవి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 


ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే సైరన్ సినిమాలో కనిపించిన జయం రవి ప్రస్తుతం జీనీ, బ్రదర్, కాదలిక నేరమిల్లై సినిమాలలో నటిస్తున్నారు.


Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు


Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter