Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. సినీతారలను ప్రశ్నించనున్న ఈడీ!
దేశ వ్యాప్తంగా సంచలన స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు వాటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖులను విచారించనున్నారని సమాచారం.
Tollywood Drugs Case: దేశ వ్యాప్తంగా సంచలన స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ హైకోర్టులో మెమో దాఖలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చామని అందులో వెల్లడించింది.
ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చామని, డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందజేసినట్లు తెలిపింది. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. దీంతో ఈడీ వేసిన కోర్టు దిక్కారణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై కోర్టు దిక్కరణ పిటిషన్ వేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ లో కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, కాల్ డేటా ఇవ్వడం లేదని ఆరోపించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. విచారణకు ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదని హైకోర్టులో వాదించింది.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని గత నెల ఎక్సైజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ మళ్లీ దూకుడు పెంచనుందని తెలుస్తోంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు వాటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖులను విచారించనున్నారని సమాచారం. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ ల్యాండరింగ్ అంశాలపై ఈడీ అధికారులు కూపీ లాగనున్నారు.
Also read: Todays Gold Rate: బంగారం ధరలో తగ్గుదల, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook