ANR-NBK-Balakrishna: నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమలో ప్రత్యర్థులుగా ఉన్న ఒరకంటే మరొకరికి మంచి గౌరవం ఉండేది. అంతేకాదు వీళ్లిద్దరు ప్రపంచ సినీ చరిత్రలో ఎక్కువ మల్టీస్టారర్ మూవీస్ చేసిన స్టార్స్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఒకరి ప్రొడక్షన్స్ హౌస్ లో వేరొకరు నటించారు కూడా. ఆ సంగతి పక్కన పెడితే.. వీరి నట వారసులుగా బాలకృష్ణ, నాగార్జున తెలుగు సినీ ఇండస్ట్రీలో నట వారసులుగా సత్తా చూపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బాలకృష్ణ .. అక్కినేని నాగేశ్వరరావును బాబాయి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు.  ఆయనతో కలిసి మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఇక నాగార్జున కూడా తండ్రి నాగేశ్వరరావుతో పలు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరామదాసు’ సినిమా టైటిల్ కార్డ్స్ లో ముందుగా తండ్రి పేరు నాగేశ్వరరావు పేరు కాకుండా.. నాగార్జున పేరు వేసారు. సెకండ్ పేరుగా గౌరవ పాత్రలో పద్మభూషణ్  అక్కినేని నాగేశ్వరరావు పేరు వేసారు. ఈ రకంగా సీనియారిటీని పక్కన పెడితే.. లెజండరీ నటుడు పేరును సెకండ్ వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


ఆ తర్వాత బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రలో నటించారు. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు పేరు తర్వాత బాలకృష్ణ పేరు తర్వాత వస్తుంది. మధ్యలో బాబాయిని అక్కినేని.. తొక్కినేని అని విమర్శలు చేసినా.. సినిమా టైటిల్స్ విషయంలో సీనియారిటీని గుర్తు పెట్టుకొని ఆయన పేరు ముందుగా వేయడం విశేషం. ఒక రకంగా కుమారుడు నాగార్జున కంటే.. బాలయ్య తన సినిమా టైటిల్స్ లో బాబాయి అని గౌరవం ఇచ్చి ఆయన పేరు ముందు ఉండేలా చేయడం విశేషం. అయితే. .ఈ టైటిల్స్ విషయంలో ఒక్కోసారి హీరోలు అంతగా పట్టించుకోరు. దర్శకులు ఈ విషయంలో ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో నాగార్జున ను తప్పు పట్టాల్సిన పనిలేదు. గతంలో తండ్రితో చేసిన సినిమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఏఎన్నార్ పేరు ముందుగానే వేసారు. ఒక్క ‘శ్రీరామదాసు’ విషయంలోనే జరిగింది. ఆ తర్వాత ‘మనం’ సినిమాలో
ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు, ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్యల  పేర్లు వస్తాయి. ఏది ఏమైనా ఈ టైటిల్స్ విషయంలో కుమారుడు కంటే బాలయ్య బెటర్ అనే కామెంట్స్ అప్పట్లో వినిపించాయి.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.