Anup Rubens Songs ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ వాటిని ఆదరిస్తున్నారు. ఈ జానర్‌లోనే ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించడమే కాకుండా.. సమర్పిస్తుండటం కూడా విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద  డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను హర్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి  ఓ మంచి పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై  అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. "పైసా రే పైసా" అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 


 



ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్సే స్వయంగా రచించి, పాడటంతో ప్రత్యేకంగా నిలిచింది. పైసా రే పైసా అంటూ ఈ సాంగ్ లో మనిషి నిజజీవితంలో డబ్బు విలువను, డబ్బు అవసరాన్ని గురించి గొప్పగా చెప్పారు. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది. హర్రర్ కామెడీ జోనర్ లో.. ఆద్యాంతం ఉల్లాసంగా, అంతే ఉత్కంఠంగా సాగే ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించాడానికి ఇలాంటి పాటలు కూడా ఉండటం విశేషం. 


Also Read:  Samantha : రాత్రంతా అదే పని.. ఉదయమంతా ఇలా.. సమంత పోస్ట్ వైరల్


ఈ పాట మొత్తం చూశాక సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడుతాయని  మేకర్స్ ఆశిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తెలుగు సెన్సెషనల్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతులు మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు నటిస్తున్నారు.


Also Read:  Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook