Umapathi Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆకట్టుకునే కథనం స్క్రీన్ ప్లే ఉంటే చాలు ప్రేమ కథలు తప్పకుండా సూపర్ హిట్ అవుతాయి. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియెన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ అందమైన ఫీల్ గుడ్ గ్రామీణ ప్రేమ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రేమ కథ చిత్రంలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే అవికా గోర్ వధువు అనే వెబ్ సిరీస్ తో మనల్ని ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు మరోసారి ఒక మంచి ప్రేమ కథతో మన ముందుకి రాబోతోంది ఈ చిన్నారి పెళ్ళికూతురు.


క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.



ఈ ట్రైలర్ చూస్తుంటే అందమైన గ్రామీణ వాతావరణం లో ఈ సినిమా మొత్తం ఉండబోతుందని అర్థమవుతోంది. ఊర్లోని రకరకాల మనస్తత్వాలున్న మనషులు, అల్లరి చిల్లరగా తిరిగే హీరో.. రెండు ఊర్ల మధ్య ఏవో గొడవలు ఉన్నట్టు.. ఆ గొడవలే హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకిలా మారేట్టు చూపించిన సీన్లు బాగున్నాయి. ట్రైలర్‌లో సహజత్వం ఉట్టి పడుతోంది. తీర్పు స్టోరీ తో కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మకంగా ఈ చిత్రం రానుంది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.


ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాకు వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు


 


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FaceTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి