ప్రభాస్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన అనుష్క
ప్రభాస్, అనుష్క శెట్టిలను ప్రనుష్క అని పిలుస్తున్న అభిమానులు, మీడియా.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జంటను అభిమానులు, మీడియా వర్గాలు విరుష్క జోడీగా సంబోధిస్తున్నట్టుగానే బాహుబలితో బాలీవుడ్‌లోనూ పేరు తెచ్చుకున్న ప్రభాస్, అనుష్క శెట్టిలను ప్రనుష్క అని పిలవడం మొదలుపెట్టారు ఆ ఇద్దరి అభిమానులు. ప్రభాస్, అనుష్క మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, త్వరలోనే ఆ ఇద్దరూ పెళ్లికి రెడీ అవుతున్నారని ఎప్పటికప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో అనేక కథనాలు హల్‌చల్ చేస్తుండటం, అందులో నిజం లేదని ఆ ఇద్దరూ స్పందిస్తుండటం తరుచూగా జరుగుతోంది. తాజాగా అనుష్కకు మరోసారి ఇదే అంశంపై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇండియా.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ప్రస్తుతం భాగమతి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా వున్న అనుష్క తన పెళ్లి రూమర్స్‌పై స్పందిస్తూ.. ప్రభాస్, తాను మంచి స్నేహితులం మాత్రమే. ప్రభాస్‌తో పెళ్లి నిజం కాదని మరోసారి బదులిచ్చినట్టు తెలుస్తోంది. తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలనే ఆలోచన లేదన్న అనుష్క.. తనకి నచ్చిన తోడు దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అని స్పష్టంచేసినట్టుగా ఆ కథనం పేర్కొంది.