Miss Shetty Mr Polishetty Collections: టాలీవుడ్ యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నయా మూవీ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' (Miss Shetty Mr Polishetty). ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి (Anushka shetty) కథానాయికగా నటించింది. సెప్టెంబ‌ర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి చిరు, రాజమౌళి మరియు మహేష్ బాబు వంటి స్టార్స్ ప్రశంసలు లభించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ విడుదలైన ప్రతి చోట మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు  ఓవర్సీస్‌లోనూ క‌లెక్ష‌న్‌ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ మూవీ 1.5 మిలియన్ డాలర్స్ రాబట్టి..  2 మిలియన్ డాలర్స్‌ మార్కు వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) దక్కించుకుంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను జీ టీవీ సొంతం చేసుకుంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాధాన్ సంగీతం అందించారు. 


తాజాగా ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు వంటి హిట్స్ తర్వాత మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టితో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు నవీన్. మూవీని సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నవీన్ ఓ నోట్ ను సోషల్ మీడియాలో పెట్టాడు. 


Also Read: Allu Arha: మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసిన అల్లు అర్హ, వీడియో వైరల్


ఇటీవల ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళల కోసం ఓ ప్రత్యేక షో వేశారు. ఈ మూవీని రీసెంట్ గా మరో భాషలో కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబరు 15 నుంచి ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 



Also Read: Samantha: సమంత బాలీవుడ్ ఎంట్రీ షురూ.. కండలవీరుడుతో జోడి కట్టనున్న సామ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook