AP government online ticketing portal : ఏపీలో ఇక నుంచి సినిమాకు వెళ్లాలంటే టిక్కెట్ల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సిన పని కూడా ఉండదు. మనకు నచ్చిన స్టార్‌‌ సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే థియేటర్‌ వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా టికెట్ల (cinema tickets) కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మూవీ టికెట్ల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ (online booking) వచ్చిన తర్వాత ప్రేక్షకులకు కాస్త ఉపశమనం లభించినా టికెట్‌ రేటు విషయంలో కాస్త అసంతృప్తే ఉంది. అందుకే టికెట్‌ ధరల (ticket rate) విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు త్వరలోనే పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.


AlsoRead : Amazon Smart Tv: త్వరలో అలెక్సాతో పనిచేసే అమెజాన్ స్మార్ట్ టీవి


రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో


ఈ మేరకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇక ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (State Film, Television, Theater Development Corporation) పర్యవేక్షనుంది. అలాగే విధి-విధానాలు, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకోనుంది. మొత్తానికి ఈ కొత్త విధానంతో టికెట్‌ రేట్ల విషయంలో పారదర్శకత లభించనుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కాగా మూవీ టికెట్స్ (Movie Tickets) బుకింగ్ విషయంలో తెలంగాణ కూడా ఇదే బాటలో పయనించనుందని తెలుస్తోంది.


Also read: Google History: గూగుల్ సెర్చ్‌లో తొలిసారిగా వెతికిన ఆ పదమేంటి, గూగుల్ ఎలా పుట్టింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook