Problem for Radhe Shyam with AP New GO: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా 'రాధేశ్యామ్'​ సందడి కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి నటించిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్​ లవర్​ బాయ్​గా నటించడం.. పూజా అందచందాలు.. పీరియాడిక్ లవ్ స్టోరీ.. విజువల్​ ఎఫెక్ట్స్.. టీజర్​, ట్రైలర్​ లాంటివి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం విడుదల కానున్న 'రాధేశ్యామ్' సినిమా టికెట్స్ ఏపీ రాష్ట్రంలో ఇంకా విడుదల కాలేదు. ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన కొత్త జీవో 13 ప్రకారం.. ఏపీలో 20 శాతం షూటింగ్ చేసుకున్న హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం ఉంది. దాంతో ఎపుడో షూటింగ్ పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్దంగా వున్న రాధేశ్యామ్ సినిమాకు ఈ కొత్త జీవో వర్తించదు. 


అలానే 100 కోట్లు దాటిన పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కూడా లేదు. ఈ నిబంధనలు నిర్మాతలకు తల నొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఓ పది రోజుల పాటు ధరలు పెంచే అవకాశం ఇవ్వాలి అంటూ.. రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ చుట్టూ ప్రొడ్యూసర్స్ అందరూ తిరుగుతున్నట్టు సమాచారం తెలుస్తోంది. అందుకే రాధేశ్యామ్ టికెట్స్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ కాలేదని తెలుస్తోంది. మరి గురువారం టికెట్ ధరలు ఎలా ఉండనున్నాయో తేలనుంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో ఇబ్బందులు తప్పకపోవచ్చు. 


రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎప్పటినుంచో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలతో ప్రభాస్‌, పూజా హగ్డేలు బిజీగా ఉన్నారు. సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ, జగపతి బాబు, సత్యరాజ్, సచిన్ ఖేడేకర్ మరియు ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాధేశ్యామ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల అవుతుంది. 


Also Read: NZ vs IND: హర్మన్‌ప్రీత్‌ పోరాడినా.. ప్రపంచకప్‌లో టీమిండియాకు తప్పని ఓటమి!!


Also Read: IPL 2022: గేల్‌, డివిలియర్స్‌ కాదు.. రోహిత్‌ శర్మనే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు: ఢిల్లీ ఎంపీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook