AR Rahman for RC 16 Project: రామ్ చరణ్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతోన్న స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారట. అయితే ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తాడని తెలిశాక కొంత మంది ఫ్యాన్స్ సంబరపడుతుంటే.. ఇంకొంత మంది అభిమానులు మాత్రం నెగెటివ్ సెంటిమెంట్‌ను గుర్తు చేసుకుంటారు. ఇంత వరకు తెలుగులో ఏఆర్ రెహమాన్ పని చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఈ నెగెటివ్ సెంటిమెంట్‌ను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఆర్ రెహమాన్ కోలీవుడ్‌లో కొట్టిన సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అయితే.. బాగానే హిట్ అయ్యాయి. అయితే తెలుగులో నేరుగా కొట్టిన సినిమాలు మాత్రం బోల్తా కొట్టేశాయి. వెంకటేష్‌ సూపర్ పోలీస్, మహేష్‌ బాబు నాని, పవన్ కళ్యాణ్‌ కొమురం పులి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ కూడా మ్యూజికల్‌గా వర్కౌట్ అయ్యాయి.


ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ రామ్ చరణ్‌ సినిమాకు కూడా వర్తిస్తుందా..? సినిమా ఫలితం ఏమైనా తేడా కొడుతుందా..? అని ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. అవన్నీ డైరెక్షన్, కథ వల్ల పోయి ఉంటాయ్ గానీ.. ఏఆర్ రెహమాన్ వల్ల కాదు కదా..? అని ఇంకొంత మంది అంటున్నారు. ఈ అపోహను రామ్ చరణ్‌ తన సినిమాతో బద్దలు కొడతాడని, బుచ్చిబాబు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read:  Akira Nandan Birthday : అకిరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూ. పవర్ స్టార్ రేర్ పిక్స్


రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్‌తో గేమ్ చేంజర్ అంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సైతం గ్లోబల్‌గా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు ఎంతో నమ్మకంగా చెబుతున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్‌ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాడని అర్థం అవుతోంది. ఆ తరువాత వెంటనే బుచ్చిబాబు సినిమాతో అందరినీ ఆశ్చర్యపరచబోయేలా ఉన్నాడు. అసలే ఇంత వరకు స్పోర్ట్స్ డ్రామాను రామ్ చరణ్‌ చేయలేదు. మరో వైపు తన ప్రాజెక్ట్ మీద బుచ్చిబాబు సైతం ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.


Also Read: Renu Desai-Pawan Kalyan Fan : మీ అన్న కొడుకా?.. అకిరా నా కొడుకు.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ ఫైర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook