Aravind Krishna SIT: ఎంత కొత్త హీరో అయినప్పటికీ కేవలం ఒక్క సినిమాతో కెరియర్ మారిపోతూ ఉంటుంది. యంగ్ హీరో అరవింద్ కృష్ణ విషయంలో కూడా అదే జరిగింది. ఈ మధ్యనే అరవింద్ కృష్ణ హీరోగా నటించిన SIT సినిమా ఇప్పుడు జి ఫైవ్ లో టాప్ లిస్టులో ట్రెండ్ అవుతుంది. ఈ ఒక్క సినిమాతో అరవింద్ కృష్ణ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) సినిమా మే 10 నుంచి జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. నాగిరెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. థియేటర్లలో కాకుండా ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లలో విడుదలైనప్పటికీ జీ 5 లో ఈ సినిమా భారీగా ట్రెండ్ అవుతుంది. 


అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అరవింద్ కృష్ణ అటు సినిమాలతో మాత్రమే కాక ఇటు స్పోర్ట్స్ తో కూడా చాలా బిజీగా ఉన్నారు. SIT సినిమాతో పెద్ద హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సినిమాలో అరవింద కృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. 


ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అరవింద్ కృష్ణ యాక్షన్ చాలా బాగుంది అని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ లలో బాగా దూసుకు పోతుండడంతో అరవింద్ కృష్ణ కి మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయి. 


ఒకవైపు స్పోర్ట్స్ తో బిజీగా ఉన్న అరవింద్ కృష్ణ ఇప్పుడు వరుసగా సినిమాలు కూడా సైన్ చేస్తున్నారు. త్వరలోనే ఏ మాస్టర్ పీస్ అనే ఆసక్తికరమైన సినిమాతో కూడా అరవింద్ కృష్ణ ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.


ఇది మాత్రమే కాక అరవింద్ కృష్ణ మరికొన్ని అడ్వెంచర్స్ సినిమాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా సెట్స్ మీదకి వెళ్లబోతున్నాయి. అరవింద్ కృష్ణ తదుపరి సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.


Also read: 7th Phase Lok Sabha Polls 2024: నేటితో ముగియననున్న చివరి దశ ఎన్నికల ప్రచారం.. జూన్ 1 పోలింగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook