Vijay Devarakonda-Rashmika mandanna: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్నాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తొలిసారి విజయ్, రష్మిక 'గీత గోవిందం' (Geetha Govindam) సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్, రష్మిక (Rashmika mandanna) అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. 'డియర్ కామ్రేడ్' (Dear Comrade) చిత్రంతో మరోసారి కలిసి నటించింది ఈ జంట. ఇందులో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది. అప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతకాలంగా రష్మిక...విజయ్ కుటుంబానికి చాలా దగ్గరయింది. దేవరకొండ ఫ్యామిలిలో జరిగే ప్రతి ఫంక్షన్ కు రష్మిక హాజరవుతోంది. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు (New year Celebrations 2022) దేవరకొండ బ్రదర్స్ తో కలిసి గోవాలో జరుపుకుంది ఈ బ్యూటీ. ఈ జంట ముంబైలో తరచూ డేటింగ్ కు, షాపింగ్ కు వెళ్తున్నారు. ఇటీవల రష్మిక ముంబైలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది చివర్లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందనే వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. అయితే రష్మిక కానీ, విజయ్ కానీ ఇప్పటి వరకు తమ రిలేషన్ షిప్ గురించి నోరు విప్పలేదు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్' (Liger) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. మరోవైపు రష్మిక నటిస్తున్న హిందీ చిత్రాలు మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. శర్వనంద్ తో రష్మిక నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలోనే అల్లు అర్జున్ తో పుష్ప 2లో చేయనుంది. 


Also Read: Rakul Preet Singh: బాయ్ ఫ్రెండ్ తో కలిసి తాజ్‌మహల్‌కు సందర్శించిన రకుల్ ప్రీత్‌సింగ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి