Arjun complained to MAA President Vishnu Manchu about Vishwak Sen: హీరో విశ్వక్సేన్ హీరో కం డైరెక్టర్ అర్జున్ సర్జా మధ్య ఏర్పడిన వివాదం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మాణం చేస్తూ ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని కొన్నాళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి విశ్వక్సేన్ తప్పుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే తమ సినిమా నుంచి విశ్వక్సేన్ తప్పుకోవడం కాదు తానే విశ్వక్సేన్ తో సినిమా చేయడం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చారు అర్జున్ సర్జా. విశ్వక్సేన్ రెండు సార్లు షెడ్యూల్ క్యాన్సిల్ చేశాడని, మూడోసారి షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత తెల్లవారితే షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం నాలుగు గంటలకు మెసేజ్ చేసి తాను షూటింగ్ కి రావడం లేదని మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి మాట్లాడిన తరువాత షూటింగ్ కి వస్తాను అని చెప్పడం ఏ మాత్రం కరెక్ట్ గా లేదని అని చెప్పుకొచ్చారు.  


సాయి మాధవ్ బుర్ర ఇచ్చిన డైలాగ్స్, చంద్రబోస్ ఇచ్చిన పాటలు,  అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ నచ్చడం లేదని కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే విశ్వక్సేన్ మాత్రం తాను ఏం చెప్పినా దానికి సెట్లో విలువ ఉండడం లేదని అన్ని ఆయనకు నచ్చిన విధంగానే చేస్తున్నారని సెట్ లో కూడా తనకి గౌరవం లభించడం లేదని ఇలాంటి టీం తో పనిచేయడం ఇష్టం లేక తాను బయటకు వెళ్ళిపోతున్నానని చెబుతూ విశ్వక్సేన్ కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.


ఇక ఇప్పటికే విశ్వక్సేన్ మీద ఫిలిం ఛాంబర్ కు అర్జున్ సర్జా ఫిర్యాదు చేయగా తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకి కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభోత్సవం సమయంలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. అలాంటిది విశ్వక్ సేన్ మీద మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Nithin- Chiranjeevi: 'భీష్మ' స్నేహాన్ని కాదనుకోలేక..చిరు కాదన్న కథతో రిస్క్ చేస్తున్న నితిన్!


Also Read: Trisha Injured : త్రిష ఫాన్స్ కు షాకింగ్ న్యూస్..కాలికి ఫ్రాక్చర్ తో ఇబ్బందుల్లో హీరోయిన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook