NCB Drug Case Update: ముంబయి క్రూయిజ్ షిప్​ డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drug Case) భాగంగా విచారణకు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎన్​సీబీకి (Drugs Case NCB) చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) సమన్లు జారీ చేసింది. అయితే.. ​ ఆదివారం (నవంబరు 7) విచారణకు ఆర్యన్​ఖాన్​ హాజరు కాలేదు. జ్వరం కారణంగా ఆర్యన్​ హాజరు కాలేదని ఓ అధికారి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబరు 3న క్రూయిజ్ ​షిప్​లో రేవ్​పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్​ఖాన్​ను (Aryan Khan’s Arrest) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు 22రోజులు జైలులోనే ఉన్నాడు. అతడి తరఫు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పుటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు.


ఆ తర్వాత అక్టోబరు 28న.. ఆర్యన్​తో పాటు మరో ఇద్దరికి 14 షరతులతో కూడిన బెయిల్​ ​ మంజూరు చేసింది న్యాయస్థానం. ఆర్యన్​కు వ్యక్తిగత నటి జుహీచావ్లా పూచీకత్తు ఇచ్చింది.


నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు


ఆర్యన్​ ఖాన్ డ్రగ్స్​ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు (Nawab Malik on Aryan Khan case) చేశారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్​ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని తెలిపారు మాలిక్​. దీనంతటికి సూత్రదారి బీజేపీ నేత మోహిత్​ కాంబోజ్ అని ఆరోపించారు.


ఇది కిడ్నాప్ కేసు..


ఈ కేసు డ్రగ్స్​కు సంబంధించింది కాదని.. కిడ్నాప్​, డబ్బు డిమాండ్​కు సంబంధించిందని (Aryan Khan Drugs case) పేర్కొన్నారు. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే (Sameer Wankhede), మోహిత్‌ కాంబోజ్‌ ఇద్దరూ డబ్బు డిమాండ్‌ చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. వాళ్లిద్దరికి ముందునుంచే సాన్నిహిత్యం ఉందన్నారు. 


Also Read: Anushka Shetty New Movie: అనుష్క బర్త్డే సర్ ప్రైజ్.. యూవీ క్రియేషన్స్ తో కొత్త సినిమా ప్రకటన 


Also Read: Janhvi kapoor: చెల్లెలి పుట్టినరోజున బార్బీగర్ల్‌గా ఆకట్టుకున్న జాన్ఙవి కపూర్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి