Ashwini Dutt Comments ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా నంది అవార్డుల ప్రకటన, వాటి ప్రధానోత్సవం కోసం వెయిట్‌ చేసేవారు. కానీ రాష్ట్రం విడిపోయినప్పటి నుండి కూడా నంది అవార్డుల ప్రధానోత్సవం గురించిన ప్రస్థావనే లేదు. ఆ మధ్య ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా నంది అవార్డులకు సంబంధించిన హడావుడి జరిగింది. అయితే అప్పుడు కూడా వారి వర్గానికి చెందిన వారికే అవార్డులు ఇచ్చే వారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆ ఊసే లేకుండా పోయింది. అసలు సినిమా ఇండస్ట్రీని జగన్ ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదు. పైగా టికెట్ రేట్ల పేరుతో టాలీవుడ్‌ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నంది అవార్డుల విషయం మరోసారి చర్చకు దారి తీస్తోంది.


మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. దాని కోసం ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్ వంటి వారు పాల్గొన్నారు. అసలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదని, నంది అవార్డుల గురించి పట్టించుకోవడం లేదని ఆదిశేషగిరి రావు అన్నారు. ఈ ఈవెంట్‌లోనే అశ్వనీదత్ ఏపీ ప్రభుత్వం మీద సెటైర్లు వేశాడు.


అశ్వినీదత్‌ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నాడో అర్థం అవుతుంది. నంది అవార్డుల గురించి స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉత్తమ గూండా.. ఉత్తమ రౌడీ వంటి అవార్డులను మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు అక్కడ వేరే సీజన్ నడుస్తోంది కదా? అని కౌంటర్లు వేశాడు. అంతే కాకుండా మరో రెండేళ్లలో అన్నీ మొదలవుతాయని, అప్పుడు ఘనంగా అవార్డుల కార్యక్రమం నిర్వహించుకుందామని అన్నాడు.


Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్


అయితే ఇప్పుడు అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలతో ప్రాజెక్ట్ కే సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఒక వేళ సినిమా ఆలస్యం అయినా, వచ్చేసారి కూడా జగన్ ప్రభుత్వంలోకి వస్తే.. ఆ సినిమా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అని.. ఇటు ప్రభాస్ అభిమానులు, అటు జగన్ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.


Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook