Kalki 2898 AD Collections: ప్రభాస్ కల్కి.. 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. భారీ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్కి గురించిన డిస్కషన్లు వినిపిస్తున్నాయి. కేవలం 600 కోట్ల.. బడ్జెట్ తో.. ఎంతో మంచి అవుట్ పుట్ ఇచ్చినందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై.. అందరూ ప్రశంసల వర్షం కనిపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత అశ్వినీ దత్.. సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడారు. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు.. నమోదు చేసుకుంటుంది.. అని మీరు అంచనా వేస్తున్నారు అని అడగక..అశ్విని దత్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. 


ఈ సినిమా 1400 నుంచి 1500 కోట్లు వసూలు.. చేస్తుంది అని అనుకుంటున్నట్లుగా తెలియజేశారు అశ్విని దత్. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. మొదటి రోజు నుంచే సినిమా కలెక్షన్ల.. మోతా మోగిస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు.. ఉన్నంత క్రేజ్ మరొక రెండు మూడు రోజుల.. తర్వాత ఉంటుందో లేదో చెప్పలేం.


వారంతం పూర్తయ్యేదాకా సినిమాకి కలెక్షన్లు.. బాగానే వస్తాయి.  కానీ ఆ తర్వాత రెండవ వారం.. వీక్ డేస్ లో కలెక్షన్లు అందడం కష్టమే. పోనీ ఒకసారి చూసేసిన ప్రేక్షకులు మళ్లీ వెళ్లి.. చూడడానికి అది చిన్న సినిమా కాదు. మూడు గంటల నిడివి.. ఉన్న సినిమా. కాబట్టి అంతసేపు వీలు కుదుర్చుకుని.. మళ్ళీ థియేటర్లకి వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు కొంతమంది మాత్రమే ఉంటారు.


మరి ఇలాంటి సమయంలో సినిమా అశ్వినీ దత్..చెప్పిన రేంజ్ లో ఆడుతుందో లేదో మాత్రం చెప్పలేం. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్.. అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ 1500 కోట్లు అంటే చాలా ఎక్కువ టార్గెట్.. అని చెప్పొచ్చు. పైగా ఓపెనింగ్ డే రోజు వచ్చినన్ని కలెక్షన్లు తర్వాత రోజు నుంచి రావు. కల్కి విషయంలో.. కూడా అదే జరిగింది. రెండవ రోజు కూడా మంచి థియేటర్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ఓపెనింగ్ డే.. వచ్చినన్ని కలెక్షన్లు తర్వాత రావు.


ఇక కల్కి 2 గురించి కూడా అశ్వినీ దత్ క్లారిటీ.. ఇచ్చారు. సినిమా షూటింగ్ 60% పూర్తయిందని, మిగతా భాగం పూర్తి కావడానికి.. మరో ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పారు. పోనీ కల్కి 2 తో అయినా కథ ఎండ్ అవుతుందా అంటే ప్రస్తుతానికి అయితే కల్కి 2 వరకే ఆలోచిస్తున్నామని.. కల్కి 3 గురించి ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పుకొచ్చారు అశ్విని దత్. అన్నీ అనుకున్నట్లు జరిగితే కల్కి 2 2026 లో విడుదల అయ్యేలాగా కనిపిస్తోంది.


Also Read: T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. సాహో భారత్.. టీ 20 ప్రపంచకప్ మనదే


Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ భారత్‌దే అనిపిస్తున్నా.. దక్షిణాఫ్రికా 'కంగారు'లా పెట్టిస్తుందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter