Ashwini Dutt says sorry: ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీద ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సీతారామం అనే సినిమా తెరకెక్కించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్,  మృణాల్ ఠాకూర్,  రష్మిక మందన,  సుమంత్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అశ్వనీదత్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొన్న ఆయన దానికి టికెట్ రేట్లు పెరిగిపోవడం థియేటర్స్ లో తినుబండారాల ధరలు కూడా భారీ ఎత్తున పెంచేయడం వంటి కారణాలు ఉన్నాయని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దెబ్బతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి సినిమా చూడడమే మరిచిపోయారని అన్నారు. ఇక నిజానికి నిర్మాతలు శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటయింది కానీ ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదని ఆయన అన్నారు. ధరలు తగ్గించాలని ఒకసారి పెంచాలని మరోసారి వాళ్లే ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడం కరెక్ట్ గా లేదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సినీ పరిశ్రమలో టికెట్ రేట్స్ వ్యవహారంపై అలాగే హీరోల పారితోషకాల విషయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ క ఇప్పుడు పనిచేస్తున్న కౌన్సిల్ కి అసలు పోలిక లేదని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


కరోనా కారణంగా థియేటర్స్ కు ప్రేక్షకులకు మధ్య కనెక్షన్ దూరమైందని అయితే ఆర్ఆర్ఆర్,  కేజీఎఫ్ 2 లాంటి సినిమాలను మళ్లీ ప్రేక్షకుల థియేటర్స్ లో చూసి ఆదరించారని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించడం ఇప్పుడున్న దర్శకనిర్మాలకు సవాలుగా మారిందని పేర్కొన్న ఆయన ముఖ్యమంత్రుల దగ్గరికి తిరిగి టికెట్లు పెంచుకోవడమే దానికి కారణం అని అన్నారు. ఒకసారి ధరలు తగ్గించామని మరోసారి పెంచామని చెబుతూ ఉండడం వల్ల సినిమా ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని టికెట్ ధరలు పెంచిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ బంద్ అంటూ ఆందోళన చేస్తున్నారని పరోక్షంగా కొంతమంది నిర్మాతలపై ఆయన ఫైర్ అయ్యారు.


పేర్లు ప్రస్తావించకపోయినా ఇష్టం వచ్చినట్లు హీరోలకు పారితోషకాలు ఇస్తున్నారని అందుకే వారి పారితోషకాలు తగ్గించాలని అనడం సరికాదని చెప్పుకొచ్చారు. మార్కెట్ పరిధి మేర హీరోలు పారితోషకాలు తీసుకుంటారు తప్ప వాళ్ళు ఏమీ అధికంగా డిమాండ్ చేయరు కదా అని ప్రస్తావించారు. ఇప్పుడున్న నిర్మాతల్లో స్థిరత్వం లేదన్న ఆయన హీరోలు రెమ్యునరేషన్ వల్లే సినిమా టికెట్ ధరలు పెంచారు అనేది పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా ఇంటర్వ్యూలో అలా మాట్లాడిన ఆయన మళ్లీ యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతలు నిర్ణయమే నా నిర్ణయం అని ఆయన మళ్లీ మీడియాకి ఒక నోట్ విడుదల చేశారు.


50 ఏళ్లుగా చిత్ర సీమలో నిర్మాతగా కొనసాగుతున్నానని తోటి నిర్మాతలు అందరితో చాలా సన్నిహితంగా సోదరభావంతో మెలిగానని అన్నారు. ఏ నిర్మాత అన్నా తనకు అగౌరవం లేదని గిల్డ్ అయినా కౌన్సిల్ అయిన నిర్మాతలు,  అలాగే చిత్ర సీమ శ్రేయస్సు కోసమే ఉద్భవించాయని చెప్పుకొచ్చారు. అయితే పరిశ్రమ కోసం అందరూ ఒకే తాటిపై నడిచి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని తన అభిప్రాయం అని వెల్లడించారు. నిర్మాతలంతా కలిసి సినీ పరిశ్రమ గురించి ఏ నిర్ణయం తీసుకున్నా నా సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.


Also Read: Shreya Dhanwanthary Hot: రెడ్ జాకెట్లో లోదుస్తులు లేకుండా రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. నెవర్ బిఫోర్ అంతే!


Also Read: Aashritha Daggubati: వెంకటేష్ కూతురు ఆశ్రిత పని ఏంటో తెలుసా.. ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook