Kishore Das Died: అస్సామీ యువ నటుడు కిషోర్ దాస్‌(30) మృతి చెందాడు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు చిక్సిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ ఏడాది మార్చిలో క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడి ఆరోగ్యం మరింత క్షిణించింది. కిషోర్ దాస్‌ను బతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించినా..ఫలితం లేకుండా పోయింది. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతడి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. యువ నటుడిని సినీ లోకం వదులుకుందన్నారు. అతడి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. వారికి మరింత ధైర్యం కలిగేలా చూడాలని దేవుడిని ప్రార్థించారు. కిషోర్‌దాస్‌ మూడు వందలకు పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించాడు. బిధాత, బంధువ్, నెదేఖా ఫగన్ వంటి తదితర టీవీ షోల్లో అలరించాడు. ఐదేళ్ల కిందట తురుట్ తురట్ పాటతో మరింత ఫేమస్ అయ్యాడు. 


Also read:Hyderabad Rain: హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!


Also read:India vs England: టీమిండియాకు గుడ్‌న్యూస్..అందుబాటులోకి వచ్చిన స్టార్ ప్లేయర్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook