Astrologer Venuswamy Says a Tollywood Hero and a Heroine Will die: తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి టెన్షన్ పుట్టించే విధంగా సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఏ మాత్రం బాలేదని ఒక తెలుగు హీరో ఒక తెలుగు హీరోయిన్ చనిపోతారని ఆయన కామెంట్లు చేశారు. అయితే ఎప్పుడో వయసు పైబడిన వారు చనిపోవడం కాదు యుక్త వయసు వారే అది కూడా 45 ఏళ్ల లోపు వారే చనిపోతారంటూ ఆయన కామెంట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశికి చెందిన ఒక హీరోయిన్, వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన ఒక హీరో చనిపోతారని హీరోయిన్ సంగతి తెలియదు కానీ హీరో మాత్రం సహజ మరణం లేదా సూసైడ్ ద్వారా మరణిస్తారని ఆయన కామెంట్లు చేశారు. తనకు వారి పేర్లు తెలుసు కానీ తాను మాత్రం పేర్లు బయట పెట్టనని ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో సమంత, నాగచైతన్య వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ కనుక కలిసి ముందుకు వెళితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు సాగదంటూ ఆయన హెచ్చరికలు చేశారు.


అయినా సరే ముందుకు వెళ్లి వివాహం చేసుకున్న సమంత, నాగచైతన్య గత ఏడాది అక్టోబర్ నెలలోనే విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మరోపక్క విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మిక మందన గతంలో ఆయన దగ్గర పూజలు కూడా చేయించుకోవడంతో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. రష్మిక మందన్నకు తాను చెప్పానని విజయ్ దేవరకొండ ప్రేమలో పడొద్దు అంటే ఆయన ప్రేమలోనే పడిందని ఇప్పుడు ఆయన జాతక రీత్యా పడుతున్న ఇబ్బందులన్నీ రష్మిక మందన్న కూడా పడాల్సి వస్తోందని కామెంట్ చేశారు.


రష్మిక మందనకి ఈ విషయం మీదే తాను ముందే హెచ్చరిక జారీ చేశానని అయినా ఆమె పట్టించుకోలేదని ఈ సందర్భంగా వేణు స్వామి కామెంట్లు చేశారు. ఆ ప్రభావం వల్లనే రష్మిక మందన్న మీద కాంతారా యూనిట్ కామెంట్లు, రష్మిక మందన నోటి దురద వల్ల కాంతారా సినిమా చూడలేదని చెప్పడం, ఆ యూనిట్ మీదే కొన్ని కామెంట్లు చేయడం జరిగాయని అది ఏకంగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఆమెను బ్యాన్ చేయించే దిశగా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.


మరి వేణు స్వామి చెబుతున్న హీరో, హీరోయిన్ ఎవరు? వారిద్దరూ నిజంగానే ఏమైనా అవుతుందా అనేది తెలియాలంటే 2027- 28 వరకు ఆగక తప్పదని చెబుతున్నారు.  ఆ ఏడాదిలో హీరో, హీరోయిన్ ఒకరు చనిపోతారని తన మాటలు రాసి పెట్టుకోవాలని వేణు స్వామి అయితే ఘంటా పథంగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి  నిజంగానే తెలుగు సినిమా హీరో హీరోయిన్లకు ఏమైనా అవుతుందేమో చూడాలి మరి.  


Also Read: Venu Swamy on Samantha : సమంత ఆరోగ్యంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. 2025 నుంచి దారుణంగా?


Also Read:  Venkatesh Next Movie: హిట్ డైరెక్టర్ కథకు వెంకీ మామ గ్రీన్ సిగ్నల్.. కానీ అంతా కన్ఫ్యూజన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.