Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !
Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా.. కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దింపుతున్నారు.
Atlee Salman Khan Movie: అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో.. పుష్ప సినిమాకి రెండవ భాగంగా విడుదల కాబోతున్న పుష్ప 2 తో.. బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టుకి విడుదలవ్వాల్సిన ఈ సినిమా.. డిసెంబర్ కి వాయిదా పడింది. దీంతో డిసెంబర్ కైనా సినిమాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని.. చిత్ర బృందం సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తుంది.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత.. అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అట్లితో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. దీనికి సంబంధించిన.. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అల్లు అరవింద్ స్వయంగా ఈ సినిమాని.. నిర్మించడానికి ముందుకు వచ్చారు.
కానీ ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఈ సినిమా.. క్యాన్సిల్ అయిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. కొందరేమో అట్లీ 80 కోట్ల.. భారీ రెమ్యూనరేషన్ అడిగారని.. అందుకే సినిమా క్యాన్సిల్ అయిపోయిందని చెబుతుండగా మరికొందరు మాత్రం అట్లీ అల్లు అర్జున్ మధ్య క్రియేటివ్ విభేదాలు వచ్చాయని.. అందుకే సినిమా క్యాన్సిల్ అయిపోయిందని చెబుతున్నారు. మరికొందరేమో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసమే సమయం మొత్తం కేటాయిస్తున్నారని.. ఇంక ఎదురు చూడలేక అట్లీ సినిమా నుంచి తప్పకున్నారు అని చెబుతున్నారు.
కారణాలు తెలియదు కానీ బన్నీ అట్లీతో.. చేయాల్సిన సినిమా అయితే ఇప్పుడు లేదు. అయితే బన్నీ అట్లీ సినిమా క్యాన్సిల్ అయిపోయి ఇంకా వారం కూడా కాలేదు.. కానీ అప్పుడే అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో.. సినిమా చేస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అట్లీ సల్మాన్ ఖాన్ కి ఒక కథ వినిపించారని.. కథ బాగా నచ్చడంతో సల్మాన్ ఖాన్ కూడా ఓకే చెప్పేసారని.. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
అయితే అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమాని అట్లీ సల్మాన్ ఖాన్ తో చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.. కానీ మరికొందరు మాత్రం అట్లి సల్మాన్ ఖాన్ కి చెప్పింది వేరే స్క్రిప్ట్ అని అంటున్నారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో.. సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మురుగదాస్ దర్శకత్వంలో.. సికిందర్ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా.. ఈ సినిమా విడుదల కాబోతోంది. అంటే సినిమా షూటింగ్ మార్చ్ కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత అట్లీతో సల్మాన్ ఖాన్ సినిమా.. మొదలయ్యే అవకాశం ఉంది. ఆసక్తికరంగా మురుగదాస్ తర్వాత మళ్లీ.. మరొక తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీతో సల్మాన్ ఖాన్ సినిమా ఓకే చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter