Stone Pelting on Singer Mangli Car: టాలీవుడ్ లో ఫేమస్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో ఆమె కారు మీద దాడి జరిగినట్లు చెబుతున్నారు. తాజాగా బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని ఆమె తిరిగి వెళ్తుండగా ఆమె కారు పై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజకుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి రోజు వేడుకల్లో భాగంగా సింగర్ మంగ్లీ సహా మరి కొంతమంది గాయకులు పాల్గొని పర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. ప్రోగ్రాం ముగించుకుని వస్తున్న మంగ్లీ కారుపై కొంతమంది రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ స్టేజ్ పై పాటలు పాడిందని తిరిగి వెళ్లే సమయంలో ఆమెను చూసేందుకు స్థానిక యువకులు పెద్ద ఎత్తున స్టేజ్ వద్దకు చేరుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి స్టేజ్ వెనుక ఉన్న మేకప్ టెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అలర్ట్ అయ్యి వారిని అడ్డుకున్నారు.


అయితే మంగ్లీ స్వయంగా పోలీసులను అడ్డంపెట్టి తమను కలవకుండా చేసిందని కోపంతో వారేమైనా రాళ్లదాడి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క కొద్ది రోజుల క్రితం కూడా మంగ్లీ కర్ణాటకలో ఒక వివాదాన్ని ఎదుర్కొంది. చిక్కబల్లాపూర్ లో ఒక కార్యక్రమంలో మంగ్లీ పాల్గొనగా కన్నడలో మాట్లాడాలని ఆ ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనుశ్రీ కోరారు. అయితే ఇక్కడ ఉన్న వారందరికీ తెలుగు వస్తుందని చెప్పి మంగ్లీ కన్నడలో మాట్లాడలేదు, యాంకర్ బలవంతం చేయగా ఒకటి రెండు ముక్కలు మాట్లాడి ముగించింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె మీద కన్నడిగులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. తెలుగు నుంచి కన్నడ సినీ పరిశ్రమకు వచ్చి రెండేళ్లు దాటుతోందని ఇంకా కన్నడ అర్థం కావడం లేదా? ఇలాంటి వారికి ఎందుకు కనడ సినీ పరిశ్రమ అవకాశాలు ఇస్తోందని  అంటూ వారంతా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అయితే ఈ కారణం వలన ఏమైనా ఆమె మీద దాడి జరిగిందా? అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Also Read: 
Mouni Roy Hot Photos: వామ్మో సెగలు రేపేస్తున్న నాగిని.. ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా?


Also Read: VSR vs WV Collections: 'వీర సింహా' కంటే వెనుకొచ్చి 34 కోట్ల ముందంజలో వీరయ్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook